స్వ విషయం
కం.
భౌతిక దేహంబిడి , నా
జాతమునకుఁ గారణమ్ము జననీ జనకుల్ ,
సీతారాములఁ బోలెడి
పూతుల , వేంకాంబ , నన్నపూర్ణులఁ గొలుతున్. 1
సీ.
మా పితామహుఁడు బ్రహ్మపురీ నివాసుండు ,
సూర్యనారాయణుం డార్యవరుఁడు ;
అన్నపూర్ణేశ్వర , సార్థక నాముండు ,
తాపసోత్తముఁడు మా తండ్రిగారు ;
మాతా మహుండు , రాంభట్ల జగన్నాథ
శాస్త్రి వదాన్యుండు , సచ్చరితుఁడు ;
మాతులుల్ , లోక విఖ్యాతులు , న్యాయ శా
స్త్ర విశారదులు , కడు సత్త్వగుణులు ;
గీ.
పాలవెల్లియె , మా కుటుంబాల సరణి ;
ధన మధాందులుగారు , నిర్ధనులుగారు ;
కుడుచుటయు , బెట్టుటయు నేర్చుకొనినవారు ;
ద్రావిడాన్వయ జనిత ధరామరులము .2
శా.
భారద్వాజ సగోత్ర సంభవుఁడ , నాపస్తంబసూత్రుండ , జం
డీ రాజేశ్వరి పాదపద్మ మద భృంగేశుండ , శ్రీ విక్రమో
ర్వీ రాజన్య కటాక్ష వీక్షణ సిత శ్రీమంతుఁడన్ , భూసుర
క్షీరాంభోనిధి పూడిపెద్దికుల , కాశీవిశ్వనాథాఖ్యుడన్ .3
సీ.
అష్టావధాన , శతావధాన , విధాన
ఘనతర చతుర ప్రజ్ఞాధురీణుఁ ,
గామేశ్వరీ పాద కంజాత మకరంద
మధుర రసాస్వాద మధుకరీంద్రు ,
నుభయ భాషా కవితోల్లాసు గాంగని
ర్ఝర సదృగ్ధార వాచా గరిష్టు ,
భారతాంబా పాద పంకేరుహ ధ్యాన
దీక్షానురక్తు సద్దేశ భక్తు ,
గీ.
కావ్య తీర్థాది బిరుదాంకు , భవ్యచరితు ,
వరపురాణాబ్ధి సోము , సంపల్లలాము ,
పండితారాధ్యు , భూసుర ప్రవరు , సతము
సూర్యనారాయణుం , గురువర్యుఁ దలతు .4
సీ.
ఆడుచో నొకచోటఁ , బాడుచో నొకచోటఁ ,
గుడుచుచో నొకచోటఁ , గూడినాము ;
సత్యాగ్రహోద్యమ , సమయ దీక్షాబద్ధ
కంకణమ్మొక చోటఁ కట్టినాము ;
దేశనాయకుల , సందేశమ్ము వెదజల్ల ,
దేశదేశాలను తిరిగినాము ;
నిదురలోనైన , జాగ్రదవస్థలో నైన ,
దల పొక్కటే గాగ , మెలగినాము ;
గీ.
సమవయస్కులమై , చెల్మి సలిపి నార ,
మతఁడు , వడ్డాది వారాశి సిత కరుండు ,
సీత రామాంజనేయుండు , చిన్ననాటి
సఖుఁడు , కవనాకు , కవన ప్రసంగములను .5
సీ.
గాంధీ మహాత్ము శంఖరవంబునన్ బ్రీతి
జెంది , విద్యకు , స్వస్తి జెప్పినాము ;
' బ్రిటిషు బ్యురాక్రసీ ' కుటిల తంత్ర విధాన
మరికట్టునాడు చేయందినాము ;
సత్యాగ్రహోద్యమ సవన దీప్తులలోని
ఆజ్య భాగమునఁ బాలందినాము ;
మద్యపాన నిషేధ మంత్రావళిం బాడి ,
లాటీల ధాటీల నందినాము ;
తే.
అల్లినాము " స్వరాజ్య గీతామతమ్ము "
తెల్లవారి దొరతనమ్ము డుల్లువార ;
కందశతకమ్ము " ఆత్మశిక్ష "ను రచించి ,
భువి దివమ్ములు ముడివేసి , మురిసినాము .6
కం.
మా కబ్బంబుల రెండును
మోకట్టిరి దొరతనమ్ము మూడవనాడే
మా క జ్ఞాతా వాసము
చేకురె నీ నాడు , తెనుఁగు సీమల యందున్ . 7
చ.
అతనికి , నాకుఁ బ్రాయమున నంతగ భేదము లేదు ; కాని , వా
డతులిత పాండితీ గరిమ యందన ముందడుగై , స్వకీయ కా
వ్య తతి నమేయ వాగమృత వార్నిధియయ్యు ; మదీయ శైలికిన్
గుతుకముఁ జూపి , నా కవిత గొప్పగఁ బల్కు , సుహృద్గరిష్ఠతన్. 8
చ.
ఉదరము కోసమై యెదియొ యూడిగముంగొన కొండలెక్కినా ;
నిది , కడురమ్యమౌ జయపురీశుని దేశము , నాదు వాసమై
న దిపుడు ; లోటు లే కెటులొ , దినాలు గమించెడు ; సంతు గాంచితిన్ ;
గొదమల మువ్వురన్ సుతుల , గూతుల , నల్వుర సాధుశీలురన్ . 9
కం.
తమ్ముఁడొకఁడు రామాహ్వయు ,
డమ్మారుతి రీతి నాజ్ఞ నౌదల దాల్చున్ ;
సమ్ముదిత లక్క సెల్లెం
డ్రిమ్ముల ఘటియింత్రు , మెట్టి నింటికి నెపుడున్ . 10
ఉ.
నా సహధర్మ చారిణియనన్ , నవపల్లవ కోమలాంగి , సో
ల్లాస జగీషహాస రుచిరప్లుత పద్మ ముఖీలలామ , నా
గీసిన గీటు దాటని ప్రకీర్తిని గాంచిన గేస్తురా ; ల్మనో
ల్లాసిని , ప్రేమరాశినిఁ , దలంతు సతంబు , మదీయ లక్ష్మినిన్ .11
కం.
పలుదోము పుడక మొదలు స
కలముం గరువైన కరువు కాలమ్మున , నీ
బలువైన బండి నీడ్వగ ,
బల మొదవెడు విక్రమేశు , బాహుచ్ఛాయన్ . 12
సీ.
చిన్నారి , పొన్నారి చిఱుత కుఱ్ఱలె గాని ,
కడు ధీవిశాలురు గాఁ గలారు ;
విద్యా విలోలురై , సద్యశంబునుఁ గాంచి
కడు నమ్ర శీలురుగాఁ గలారు ;
పిన్న , పెద్దల యందు బ్రేమ మన్ననఁ జూపి ,
కడు బుద్ధిమంతులుగాఁ గలారు ;
ధనలోప మొకడడ్డు దగిలి యున్నది , గాని
భవితవ్యమున బాగుపడ గలారు ;
గీ.
మువురు సుతులు , చిరంజీవులవుదు రిటుల ,
సుతుల భవితవ్యమునకు నే వెతయు లేదు ;
నలువు రవివాహితలు సుతల్ గలరు ; వారి
కయల నెమకంగ గుండియ లవియు నాకు . 13
చ.
ఇరువదియైదు వత్సరము లేగె , భవత్పరి పోషితుండనై
తిరిగితి దావకీనమగు దిజ్ఞ గ రాట్పరి రక్షకుండనై ,
నెఱపితి రాచకార్యములు నీదు హితంబునుఁ గోరె యెప్డు . భూ
వరు కరుణా కటాక్షమున వర్ధిలుచుంటిని , విక్రమేశ్వరా ! 14
శా.
గీతాగాన సుధాస్రవంతి మురళిం గీల్కొల్పి మ్రోయింపగాఁ
బూతం బయ్యెను భారతావని ; జగత్పూజ్యుల్ మహాధీరు లీ
గీతాసారము భిన్న భిన్న గతులన్ గీర్తించియుండన్ , ననుం
సీతారాముఁడు తెన్గు సేయుమనియెన్ శీఘ్రమ్ము పద్యాళిలోన్ . 15
ఉ.
" గీతను గీతపద్యముల గేయములందు రచించినట్టి వి
ఖ్యాత కవీంద్రు లెందఱొ జగన్నుతి గన్న మనీషులుండ , నా
వ్రాతలె మిన్నలౌనె సరివచ్చు నటన్న నభస్సుమమ్మె యౌ ,
నా తరమా " యనంగ విని , నాదగు మిత్రుఁడు వల్కె నిట్టులన్. 16
తే.
కృష్ణ కర్ణా మృతముగఁ గవీంద్రు లెంద
రెందరో గీతలను మున్ రచించి నార ,
లైన నేమాయె యెవ్వరి దైన సొమ్ము ,
లెమ్ము , వ్రాయుము , కృష్ణార్పణమ్ము గాఁగ , 17
చ.
అని కడు ప్రోత్సహించిన వయస్యుని పల్కుల నాదరించి , నా
మనము ప్రయత్మ మూను నసమర్థతచే వెనుకంజ వేయు , నీ
యనువున గొన్ని వత్సరములయ్యె ; హఠాత్తుగ నా శరీరమం
దెనసె న్యుమోనియా జ్వరము , మృత్యు భవంబుల మధ్య నూపుచున్ . 18
కం.
మంచాన మూడు మాసము
లుంచి , శరీరమున నెముకలుంచి , యడంచన్
మించు వలె మనము శాంతిన్
గాంచె , హృషీకేశు పాద కంజాతములన్ ! 19
కం.
గీతాను వాదమును నా
చేతను సాగింప నెంచి , శ్రీకృష్ణుఁడె నా
కీ తనువు బెంచె కొంచెము ,
వ్రాత కనుజ్ఞాతునై , వరమ్ము వడసితిన్ ! 20
ఉ.
పండిత హృద్యమై , సొబగు పట్టులు నాదు కవిత్వమందు లే
కుండిన నేమి , గీతను రసోచితరీతి నెఱుంగఁ బల్కినన్ ,
బండెను నాదు భాగ్యము , భవంబు కృతార్థతనందె ; గావునన్ ,
బండిత పామరాది ప్రజపై భరముంతు ననుగ్రహింపు డీ . 21
Showing posts with label గీతామకరందము. Show all posts
Showing posts with label గీతామకరందము. Show all posts
Wednesday, January 13, 2010
శ్రీ గీతా మాహాత్మ్యము
ధరోవాచ :
భగవన్ పరమేశాన భక్తి రవ్యభిచారిణీ I
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో II
భూదేవి వాక్యము:
ఓ భగవాన్ ! పరాత్పరా ! ఐహిక జీవనమున ప్రారబ్ధ కర్మలో మునిగియున్న మానవుని యందు అచంచల భక్తి యెట్లు ఉదయించగలదు ? ప్రభూ ! 1
శ్రీ విష్ణు రువాచ:
ప్రారబ్ధం భుజ్యమానో2పి గీతా భ్యాసరత స్సదా I
స ముక్తస్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. II
శ్రీ విష్ణువు వాక్యము:
ప్రాపంచిక కార్యములలో పాల్గొనుచున్నను , నియమబద్ధముగ గీతాధ్యయనము చేయువాఁడు ముక్తు డగును . అతఁడు ప్రపంచమున నానంద మనుభవించును . కర్మలతనిని బంధింప నేరవు . 2
మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ I
క్వచిత్స్పర్శం న కుర్వన్తి నలినీదల మమ్బువత్ II
తామరాకును నీ రెట్లు స్పృశింప జాలదో గీతాధ్యానరతుని మహా పాపములు కూడ అంటనేరవు . 3
గీతాయాః పుస్తకం యత్రయత్ర పాఠః ప్రవర్త తే I
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై II
గీతాగ్రంథము ఎచ్చట నుండునో , ఎచ్చట దాని పఠనము జరుగునో అచ్చట ప్రయాగాది సర్వపుణ్య తీర్థములును ఉండును. 4
సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ యే
గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే II
ఎచ్చట గీతాపారాయణ జరుగుచుండునో , అచట సర్వ దేవతలు , ఋషులు , యోగులు , నాగులు , గోపాలురు , గోపికలు , భగవంతుని సాంగత్యములో ఉండు నారదుఁడు , ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగ సహాయ మొనర్తురు . 5
యత్ర గీతావిచారశ్చ పఠనం పాఠనం శ్రుతమ్ I
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదై వహి II
ఓ భూ దేవీ ! ఎచ్చట గీతా విచారణ , ఫఠనము , శ్రవణము , బోధ , ధ్యానము జరుగుచుండునో అచ్చట నే నెల్లప్పుడును తప్పక నివసించు చుందును. 6
గీతాశ్రయో2 హం తిష్ఠామి గీతామే చోత్తమంగృహమ్ I
గీతాజ్ఞాన ముపాశ్రిత్య త్రీన్లోకాన్పాలయామ్యహమ్ II
నేను గీతయందు వసింతును . గీత నా అత్యుత్తమ నివాసమందిరము . గీతాజ్ఞానము నాధారముగ చేసికొనియే ముల్లోకములను నేను పాలించుచున్నాను.7
గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః I
అర్ధమాత్రాక్షరా నిత్యా స్వానిర్వాచ్య పదాత్మికా II
గీత నాయొక్క పరమవిద్య . అది బ్రహ్మ స్వరూపము . ఇందు సంశయము లేదు . అది శాశ్వతము . ప్రణవము యొక్క నాల్గవపాదమగు అర్థమాత్రా స్వరూపము , నాశన రహితమును అనిర్వచనీయమును అయియున్నది. 8
చిదానన్దేన కృష్ణేన ప్రోక్తేన స్వముఖతో2ర్జునమ్ I
వేదత్రయీ పరానన్దా తత్వార్థ జ్ఞాన మంజసా II
గీతను సర్వజ్ఞ్డుడు సచ్చిదానంద మూర్తి యునగు శ్రీ కృష్ణపరమాత్మ స్వయముగ తన నోటితో ముఖాముఖి అర్జునునకు చెప్పెను. అది మూడు వేదముల సారము , దాని నాశ్రయించువారి కది పరమార్థ జ్ఞానము నందజేయును . అది పరమానంద స్వరూపమై విలసిల్లును ,9
యో2ష్టాదశ జపే న్నిత్యం నరో నిశ్చలమానసఃI
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదమ్ II
నిర్మలము, నిశ్చలమునగు మనస్సుతో అనుదినము గీత పదునెనిమిది అధ్యాయములు పారాయణ చేయువాడు జ్ఞాన సిద్ధి నొంది అత్యుత్తమ స్థితిని ( మోక్షమును ) పొందును .10
పాఠే2 సమర్థః సంపూర్ణే తతో2ర్థం పాఠ మాచరేత్ I
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః II
పూర్తి పారాయణము సంభవము కాని యెడల , సగభాగమైనను చదివిన యెడల గోదానము వలన కలుగు పుణ్యము లభించును . ఇందెట్టి సంశయమును లేదు .11
త్రిభాగం పఠమానస్తు గఙ్గా స్నానఫలం లభేత్ I
ఛడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్ II
నిత్యము గీతలో మూడవ భాగము పారాయణ చేయువానికి పవిత్ర గంగా స్నానము వలన కలుగు పుణ్యమును , ఆరవవంతు పఠించువానికి సోమయాగ ఫలమును ప్రాప్తించును .12
ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుతః I
రుద్రలోక మవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరమ్ II
ఎవడు గీతలో ఒక అధ్యాయము నిశ్చల భక్తితో నిత్యము పారాయణ చేయునో , అతడు రుద్రలోకమును పొంది రుద్రగణములలో నొకడుగ పెక్కు సంవత్సరము లచట నివసించును .13
అధ్యాయం శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః I
స యాతి నరతాం యావన్మన్వంతరం వసున్ధరే II
ఓ భూదేవీ ! ఒక అధ్యాయము కాని , ఒక శ్లోక పాదముకాని అనుదినము పారాయణ చేయువాడు మన్వంతరము వరకు మానవ జన్మనే పొందును . ( మన్వంతర మనగా 71 మహాయుగములు లేక 30,84,48,000 సంవత్సరములు ).
గీతాయాః శ్లోక దశకం సప్త పఞ్చ చతుష్టయమ్ I
ద్వౌత్రీ నేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః II
చన్ద్రలోక మవాప్నోతి వర్షాణా మయుతం ధ్రువమ్ I
గీతాపాఠసమాయుక్తో మృతో మానుషతాంవ్రజేత్ II
ప్రతిదినము ఏ మనుజుడు పది , ఏడు , ఐదు , నాలుగు , మూడు , రెండు శ్లోకములు , ఒకటి లేదా సగము శ్లోకము పఠించినను చంద్ర లోకమును పొంది అచట పదివేల సంవత్సరములు నివసించును . గీతను ప్రతి దినము పఠించు నభ్యాసములో నున్నవాఁడు చనిపోయిన పిదప మరుజన్మలో మానవుడై పుట్టును . 15,16
గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తి ము త్తమామ్ I
గీతే త్యుచ్చారసంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ II
ఇట్లాతఁడు మానవుడై జన్మించి గీతను మఱల మఱల పారాయణ చేయుచు ఉత్తమ మగు మోక్షము నొందును . " గీతా గీతా " అని మరణ కాలమున ఉచ్చరించువాఁడు సద్గతిని పొందును . 17
గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతో2పివా I
వైకుణ్ఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే II
మహాపాపాత్ముడైనను గీతార్థమును విను నాసక్తి గలవాఁడు విష్ణు లోకమునకుఁ బోయి , విష్ణుదేవునితో నానందము ననుభవించు చుండును . 18
గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణిభూరిశః I
జీవన్ముక్తః స విజ్ఞేయో దేహాన్తే పరమం పదం II
గీతార్థమును నిత్యమును చింతన చేయువాడు ఎన్ని కర్మల నాచరించినను , దేహాంతరమున పరమ ధామము నొందును . మఱియు అతఁడు జీవించి యుండగనే జీవన్ముక్తుడని చెప్పబడును .19
మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే I
సకృద్గీతామ్భసి స్నానం సంసార మల మోచనమ్ II
దైనందిన స్నానము మనుజుల శరీరమున గల మాలిన్యమును పోగొట్టి శుభ్రపఱచును - ఒక్కసారి గీతా పవిత్రోదకములందు స్నానము చేసిననే సంసార కాలుష్యమంతయు పోయి పునీతులగుదురు .20
గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః I
నిర్ధూతకల్మషా లోకే గీతా యాతాః పరమం పదమ్ II
గీతను ఆశ్రయించి యీ లోకమున జనక మహారాజు మున్నగు రాజు లెందఱో పునీతులై అత్యున్నత గతిని , మోక్షమును పొందిరి . అట్లు గీత కీర్తింప బడుచున్నది . 21
యే శృణ్వన్తి పఠన్త్యేన గీతాశాస్త్ర మహర్నిశమ్ I
న తే వై మానుషా జ్ఞోయా దేవా ఏవ న సంశయః II
అహర్నిశములందు గీతా మహా శాస్త్రమును శ్రవణము , పఠనము చేయు వారిని మానవ మాత్రులని తలవకుము . వారు దేవతా స్వరూపులే . 22
జ్ఞానా జ్ఞాన కృతం నిత్య మిన్ద్రియై ర్జనితం చ యత్ I
తత్సర్వం నాశ మాయాతి గీతా పాఠేన తత్క్షణమ్ II
నిరంతర గీతాపఠనము వలన , తెలిసి కాని , తెలియక కాని ఇంద్రియముల ద్వారా లేక మరెట్టివైనా చేసిన పాపము లన్నియు తక్షణమే నశించిపోవును . 23
ధిక్ తస్యజ్ఞాన మాచారం వ్రతం చేష్టాం తపోయశః I
గీతార్థ పఠనం నాస్తి నాధమ స్తత్పరో జనః II
గీతాపఠనాసక్తి లేనివాని విద్య , ప్రవర్తన , నియమములు , ఆచారములు , వ్యవహారములు , తపస్సు , యశస్సునకును ధిక్కారమగు గాక ! అట్టివాడు నిజముగ అధముడే . 24
సంసార సాగరం ఘోరం తర్తు మిచ్ఛతి యో జనః I
గీతా నావం సమారూహ్యం పారం యాతి సుఖేన సః II
భయంకరమగు సంసార మహా సాగరమును దాటిపోవ నెంచువాడు గీత అను నావ నెక్కి సులువుగ ఆవలియొడ్డు చేరగలుగును .25
గీతా యాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ I
వృథాపాఠో భ వేత్తస్య శ్రమ యేవ హ్యుదాహృతః II
గీతను పఠించిన పిదప ఎవఁడు గీతా మాహాత్మ్యమును పఠింపడో వానికి ఫలితమేమియు లేక శ్రమయే మిగులును . అనగా పరిపూర్ణ విశ్వాసముతో గీతను , దాని మాహాత్మ్యమును గూడ పఠించువానికి సత్ఫలితములు తప్పక కలుగునని భావము . 26
ఏతన్మా హాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః I
స తత్ఫల మవాప్నోతి దుర్లభాం గతి మాప్నుయాత్ II
ఈ మాహాత్మ్యముతో బాటు ఎవఁడు గీతను అధ్యయనము చేయునో , అత డుదహరించిన ఫలమును పొంది అన్యధా దుర్లభమైన సద్గతిని ( మోక్షమును ) పొందగలడు . 27
సూత ఉవాచ :
మాహాత్మ్య మే తద్గీతాయాః మయాప్రోక్తం సనాతనమ్ I
గీతా న్తేచ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలమ్ లభేత్ II
సూతుల వాక్యము :
ఓ శౌనకాది మహర్షులారా ! నాచే వివరింపబడిన యీ గీతా మహాత్మ్య ప్రశస్తి గీతాధ్యయనము చివర చదువవలెను . అప్పుడు అందు చెప్పబడిన ఫలితములు తప్పక కైవసమగును .
ఓం తత్ సత్ ఇతి శ్రీ వరాహ పురాణే
శ్రీ గీతా మాహాత్మ్యమ్ సంపూర్ణమ్
ఓం తత్ సత్ ఇట్లు శ్రీ వరాహ పురాణ మందలి
శ్రీ గీతా మహాత్మ్యము సంపూర్ణము.
ఓం శాంతిః శాంతిః శాంతిః
భగవన్ పరమేశాన భక్తి రవ్యభిచారిణీ I
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో II
భూదేవి వాక్యము:
ఓ భగవాన్ ! పరాత్పరా ! ఐహిక జీవనమున ప్రారబ్ధ కర్మలో మునిగియున్న మానవుని యందు అచంచల భక్తి యెట్లు ఉదయించగలదు ? ప్రభూ ! 1
శ్రీ విష్ణు రువాచ:
ప్రారబ్ధం భుజ్యమానో2పి గీతా భ్యాసరత స్సదా I
స ముక్తస్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. II
శ్రీ విష్ణువు వాక్యము:
ప్రాపంచిక కార్యములలో పాల్గొనుచున్నను , నియమబద్ధముగ గీతాధ్యయనము చేయువాఁడు ముక్తు డగును . అతఁడు ప్రపంచమున నానంద మనుభవించును . కర్మలతనిని బంధింప నేరవు . 2
మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ I
క్వచిత్స్పర్శం న కుర్వన్తి నలినీదల మమ్బువత్ II
తామరాకును నీ రెట్లు స్పృశింప జాలదో గీతాధ్యానరతుని మహా పాపములు కూడ అంటనేరవు . 3
గీతాయాః పుస్తకం యత్రయత్ర పాఠః ప్రవర్త తే I
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై II
గీతాగ్రంథము ఎచ్చట నుండునో , ఎచ్చట దాని పఠనము జరుగునో అచ్చట ప్రయాగాది సర్వపుణ్య తీర్థములును ఉండును. 4
సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ యే
గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే II
ఎచ్చట గీతాపారాయణ జరుగుచుండునో , అచట సర్వ దేవతలు , ఋషులు , యోగులు , నాగులు , గోపాలురు , గోపికలు , భగవంతుని సాంగత్యములో ఉండు నారదుఁడు , ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగ సహాయ మొనర్తురు . 5
యత్ర గీతావిచారశ్చ పఠనం పాఠనం శ్రుతమ్ I
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదై వహి II
ఓ భూ దేవీ ! ఎచ్చట గీతా విచారణ , ఫఠనము , శ్రవణము , బోధ , ధ్యానము జరుగుచుండునో అచ్చట నే నెల్లప్పుడును తప్పక నివసించు చుందును. 6
గీతాశ్రయో2 హం తిష్ఠామి గీతామే చోత్తమంగృహమ్ I
గీతాజ్ఞాన ముపాశ్రిత్య త్రీన్లోకాన్పాలయామ్యహమ్ II
నేను గీతయందు వసింతును . గీత నా అత్యుత్తమ నివాసమందిరము . గీతాజ్ఞానము నాధారముగ చేసికొనియే ముల్లోకములను నేను పాలించుచున్నాను.7
గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః I
అర్ధమాత్రాక్షరా నిత్యా స్వానిర్వాచ్య పదాత్మికా II
గీత నాయొక్క పరమవిద్య . అది బ్రహ్మ స్వరూపము . ఇందు సంశయము లేదు . అది శాశ్వతము . ప్రణవము యొక్క నాల్గవపాదమగు అర్థమాత్రా స్వరూపము , నాశన రహితమును అనిర్వచనీయమును అయియున్నది. 8
చిదానన్దేన కృష్ణేన ప్రోక్తేన స్వముఖతో2ర్జునమ్ I
వేదత్రయీ పరానన్దా తత్వార్థ జ్ఞాన మంజసా II
గీతను సర్వజ్ఞ్డుడు సచ్చిదానంద మూర్తి యునగు శ్రీ కృష్ణపరమాత్మ స్వయముగ తన నోటితో ముఖాముఖి అర్జునునకు చెప్పెను. అది మూడు వేదముల సారము , దాని నాశ్రయించువారి కది పరమార్థ జ్ఞానము నందజేయును . అది పరమానంద స్వరూపమై విలసిల్లును ,9
యో2ష్టాదశ జపే న్నిత్యం నరో నిశ్చలమానసఃI
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదమ్ II
నిర్మలము, నిశ్చలమునగు మనస్సుతో అనుదినము గీత పదునెనిమిది అధ్యాయములు పారాయణ చేయువాడు జ్ఞాన సిద్ధి నొంది అత్యుత్తమ స్థితిని ( మోక్షమును ) పొందును .10
పాఠే2 సమర్థః సంపూర్ణే తతో2ర్థం పాఠ మాచరేత్ I
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః II
పూర్తి పారాయణము సంభవము కాని యెడల , సగభాగమైనను చదివిన యెడల గోదానము వలన కలుగు పుణ్యము లభించును . ఇందెట్టి సంశయమును లేదు .11
త్రిభాగం పఠమానస్తు గఙ్గా స్నానఫలం లభేత్ I
ఛడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్ II
నిత్యము గీతలో మూడవ భాగము పారాయణ చేయువానికి పవిత్ర గంగా స్నానము వలన కలుగు పుణ్యమును , ఆరవవంతు పఠించువానికి సోమయాగ ఫలమును ప్రాప్తించును .12
ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుతః I
రుద్రలోక మవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరమ్ II
ఎవడు గీతలో ఒక అధ్యాయము నిశ్చల భక్తితో నిత్యము పారాయణ చేయునో , అతడు రుద్రలోకమును పొంది రుద్రగణములలో నొకడుగ పెక్కు సంవత్సరము లచట నివసించును .13
అధ్యాయం శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః I
స యాతి నరతాం యావన్మన్వంతరం వసున్ధరే II
ఓ భూదేవీ ! ఒక అధ్యాయము కాని , ఒక శ్లోక పాదముకాని అనుదినము పారాయణ చేయువాడు మన్వంతరము వరకు మానవ జన్మనే పొందును . ( మన్వంతర మనగా 71 మహాయుగములు లేక 30,84,48,000 సంవత్సరములు ).
గీతాయాః శ్లోక దశకం సప్త పఞ్చ చతుష్టయమ్ I
ద్వౌత్రీ నేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః II
చన్ద్రలోక మవాప్నోతి వర్షాణా మయుతం ధ్రువమ్ I
గీతాపాఠసమాయుక్తో మృతో మానుషతాంవ్రజేత్ II
ప్రతిదినము ఏ మనుజుడు పది , ఏడు , ఐదు , నాలుగు , మూడు , రెండు శ్లోకములు , ఒకటి లేదా సగము శ్లోకము పఠించినను చంద్ర లోకమును పొంది అచట పదివేల సంవత్సరములు నివసించును . గీతను ప్రతి దినము పఠించు నభ్యాసములో నున్నవాఁడు చనిపోయిన పిదప మరుజన్మలో మానవుడై పుట్టును . 15,16
గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తి ము త్తమామ్ I
గీతే త్యుచ్చారసంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ II
ఇట్లాతఁడు మానవుడై జన్మించి గీతను మఱల మఱల పారాయణ చేయుచు ఉత్తమ మగు మోక్షము నొందును . " గీతా గీతా " అని మరణ కాలమున ఉచ్చరించువాఁడు సద్గతిని పొందును . 17
గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతో2పివా I
వైకుణ్ఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే II
మహాపాపాత్ముడైనను గీతార్థమును విను నాసక్తి గలవాఁడు విష్ణు లోకమునకుఁ బోయి , విష్ణుదేవునితో నానందము ననుభవించు చుండును . 18
గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణిభూరిశః I
జీవన్ముక్తః స విజ్ఞేయో దేహాన్తే పరమం పదం II
గీతార్థమును నిత్యమును చింతన చేయువాడు ఎన్ని కర్మల నాచరించినను , దేహాంతరమున పరమ ధామము నొందును . మఱియు అతఁడు జీవించి యుండగనే జీవన్ముక్తుడని చెప్పబడును .19
మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే I
సకృద్గీతామ్భసి స్నానం సంసార మల మోచనమ్ II
దైనందిన స్నానము మనుజుల శరీరమున గల మాలిన్యమును పోగొట్టి శుభ్రపఱచును - ఒక్కసారి గీతా పవిత్రోదకములందు స్నానము చేసిననే సంసార కాలుష్యమంతయు పోయి పునీతులగుదురు .20
గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః I
నిర్ధూతకల్మషా లోకే గీతా యాతాః పరమం పదమ్ II
గీతను ఆశ్రయించి యీ లోకమున జనక మహారాజు మున్నగు రాజు లెందఱో పునీతులై అత్యున్నత గతిని , మోక్షమును పొందిరి . అట్లు గీత కీర్తింప బడుచున్నది . 21
యే శృణ్వన్తి పఠన్త్యేన గీతాశాస్త్ర మహర్నిశమ్ I
న తే వై మానుషా జ్ఞోయా దేవా ఏవ న సంశయః II
అహర్నిశములందు గీతా మహా శాస్త్రమును శ్రవణము , పఠనము చేయు వారిని మానవ మాత్రులని తలవకుము . వారు దేవతా స్వరూపులే . 22
జ్ఞానా జ్ఞాన కృతం నిత్య మిన్ద్రియై ర్జనితం చ యత్ I
తత్సర్వం నాశ మాయాతి గీతా పాఠేన తత్క్షణమ్ II
నిరంతర గీతాపఠనము వలన , తెలిసి కాని , తెలియక కాని ఇంద్రియముల ద్వారా లేక మరెట్టివైనా చేసిన పాపము లన్నియు తక్షణమే నశించిపోవును . 23
ధిక్ తస్యజ్ఞాన మాచారం వ్రతం చేష్టాం తపోయశః I
గీతార్థ పఠనం నాస్తి నాధమ స్తత్పరో జనః II
గీతాపఠనాసక్తి లేనివాని విద్య , ప్రవర్తన , నియమములు , ఆచారములు , వ్యవహారములు , తపస్సు , యశస్సునకును ధిక్కారమగు గాక ! అట్టివాడు నిజముగ అధముడే . 24
సంసార సాగరం ఘోరం తర్తు మిచ్ఛతి యో జనః I
గీతా నావం సమారూహ్యం పారం యాతి సుఖేన సః II
భయంకరమగు సంసార మహా సాగరమును దాటిపోవ నెంచువాడు గీత అను నావ నెక్కి సులువుగ ఆవలియొడ్డు చేరగలుగును .25
గీతా యాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ I
వృథాపాఠో భ వేత్తస్య శ్రమ యేవ హ్యుదాహృతః II
గీతను పఠించిన పిదప ఎవఁడు గీతా మాహాత్మ్యమును పఠింపడో వానికి ఫలితమేమియు లేక శ్రమయే మిగులును . అనగా పరిపూర్ణ విశ్వాసముతో గీతను , దాని మాహాత్మ్యమును గూడ పఠించువానికి సత్ఫలితములు తప్పక కలుగునని భావము . 26
ఏతన్మా హాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః I
స తత్ఫల మవాప్నోతి దుర్లభాం గతి మాప్నుయాత్ II
ఈ మాహాత్మ్యముతో బాటు ఎవఁడు గీతను అధ్యయనము చేయునో , అత డుదహరించిన ఫలమును పొంది అన్యధా దుర్లభమైన సద్గతిని ( మోక్షమును ) పొందగలడు . 27
సూత ఉవాచ :
మాహాత్మ్య మే తద్గీతాయాః మయాప్రోక్తం సనాతనమ్ I
గీతా న్తేచ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలమ్ లభేత్ II
సూతుల వాక్యము :
ఓ శౌనకాది మహర్షులారా ! నాచే వివరింపబడిన యీ గీతా మహాత్మ్య ప్రశస్తి గీతాధ్యయనము చివర చదువవలెను . అప్పుడు అందు చెప్పబడిన ఫలితములు తప్పక కైవసమగును .
ఓం తత్ సత్ ఇతి శ్రీ వరాహ పురాణే
శ్రీ గీతా మాహాత్మ్యమ్ సంపూర్ణమ్
ఓం తత్ సత్ ఇట్లు శ్రీ వరాహ పురాణ మందలి
శ్రీ గీతా మహాత్మ్యము సంపూర్ణము.
ఓం శాంతిః శాంతిః శాంతిః
Monday, November 30, 2009
పురుషోత్తమ ప్రాప్తియోగము
| శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) | శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు) శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952) | గీతా మకరందము(తెలుగు తాత్పర్యము) శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979) |
|---|---|---|
శ్రీభగవానువాచ| అనుష్టుప్. ఊర్ధ్వమూలమధఃశాఖ మశ్వత్థం ప్రాహురవ్యయమ్| ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్|| 15-1 | శ్రీ భగవానుల వాక్యము . తేటగీతి . ఊర్ధ్వ మూలము , తరుశాఖ లుండుఁ గ్రింద , వేదములె యాకులౌచు , ననాదియైన యీ జగంబను నశ్వత్థ భూజ మలరు , నిది యెఱింగిన వాఁడె కోవిదుఁడు పార్థ ! ౧ | దేనికి వేదములు ఆకులుగ నున్నవో , అట్టి సంసారమును అశ్వత్థ వృక్షము ( రావిచెట్టు )ను పైన వేళ్ళు గలదిగను ,క్రింద కొమ్మలు గలదిగను , ( జ్ఞానప్రాప్తి పర్యంతము ) నాశములేనిదిగను ( పెద్దలు ) చెప్పుదురు . దాని నెవడు తెలిసికొనుచున్నాడో , ఆతడు వేదార్థము నెఱిగిన వాడు ( అగుచున్నాడు ) . |
ఉపజాతి. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాలాః| అధశ్చ మూలాన్యనుసన్తతాని కర్మానుబన్ధీని మనుష్యలోకే|| 15-2 | ఉత్పలమాల . కొమ్మలు క్రిందుమీఁదఁ బెనఁగొంచు బలిష్ఠగుణ ప్రవృద్ధమై గ్రమ్ముకొనున్ , జిగుళ్ళు చిగురందుఁ గడున్ విషయాను రక్తి మన్ , యిమ్మహి కర్మబంధముల నీడ్చి బిగించును మానవాళి , మూ లమ్మను రాగ తాపముల లంపటులైన కతంబు ఫల్గునా ! ౨ | ఆ ( సంసార ) వృక్షముయొక్క కొమ్మలు ( సత్త్వరజస్తమోగుణములచే ) వృద్ధి బొందింపబడినవియు , ( శబ్దాది విషయములనెడు చిగుళ్ళుగలవియునై ), క్రిందికిని ( స్థావరము మొదలుకొని ) మీదికిని ( బ్రహ్మలోకము వఱకు ) వ్యాపించియున్నవి . మనుష్యలోకమునందు కర్మసంబంధమును ( కర్మవాసనలను ) గలుగజేయునవియగు దాని వేళ్ళు క్రిందను ( మీదనుగూడ ) బాగుగ విస్తరించి( దృఢముగ ) నాటుకొని యున్నవి . |
ఉపజాతి . న రూపమస్యేహ తథోపలభ్యతే నాన్తో న చాదిర్న చ సమ్ప్రతిష్ఠా| అశ్వత్థమేనం సువిరూఢమూలం అసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్త్వా|| 15-3 ఉపజాతి . తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్గతా న నివర్తన్తి భూయః| తమేవ చాద్యం పురుషం ప్రపద్యే| యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ|| 15-4 | చంపకమాల . తుది మొదలే కనంబడవు , తోచు మనోగత రూప భావనన్ బదిలము వ్రేళ్ళు తన్ని గరువంపు మహీజముఁగాగ బొల్చె , బె ట్టిదపు నసంగ శస్త్రపు పటిష్ఠతతో గురువేరులన్ దెగం జిదుపవలెన్ , గిరీటి ! ధృడచిత్తము తోడ , సమూల వృక్షమున్ . ౩ తేటగీతి . ఎవఁడు సకలమ్మునకు మూలమవుచు నుండు , నెవని కడనుండి సకల ప్రవృత్తి యెసగు , నట్టి నాదగు సత్పథం బఱయ వలయు , నది గమించినఁ దిరిగి రానట్టి చోటు . ౪ | ఆ సంసారవృక్షముయొక్క స్వరూపము ఆలాగున ( ఇపుడు వర్ణింపబడిన రీతిగ ) ఈ ప్రపంచమున ( సంసారాసక్తి గలవారిచేత ) తెలియబడకున్నది . దాని ఆదిగాని , అంతముగాని , మధ్యము ( స్థితి ) గాని కనబడకున్నది . గట్టిగ వేళ్ళు పాఱిన ఈ సంసారమను అశ్వత్థవృక్షమును అసంగమను బలమైన ఆయుధముచే నఱకి వైచి ఆ పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించినవారు మఱల వెనుకకు ( సంసారమునకు ) రారో , ఎవనినుండి అనాదియైన ఈ సంసారవృక్షముయొక్క ప్రవృత్తి వ్యాపించెనో , ( అట్టి ) ఆదిపురుషుడగు పరమాత్మనే శరణు బొందుచున్నాను - అను నిట్టి ( భక్తి ) భావముతో ఆ పరమాత్మ పదమును వెదకవలయును . |
ఇంద్రవజ్ర . నిర్మానమోహా జితసఙ్గదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః| ద్వన్ద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్- గచ్ఛన్త్యమూఢాః పదమవ్యయం తత్|| 15-5 | తేటగీతి . ద్వంద్వముల యందు సమభావ మందు వారి , మోహ ముడిపిన వారల ముక్త సంగు లాత్మ తత్త్వమ్ముఁ దెలిసిన యట్టివారి , కామ వర్జితులౌ వారి ధామ మద్ది . ౫ | అభిమానము ( లేక , అహంకారము ) అవివేకము లేనివారును , సంగము ( దృశ్యపదార్థములం దాసక్తి ) అను దోషమును జయించినవారును , నిరంతరము ఆత్మజ్ఞానము ( బ్రహ్మనిష్ఠ ) గలవారును , కోరికలన్నియు లెస్సగ ( వాసనారహితముగ ) తొలగినవారును , సుఖదుఃఖములను ద్వంద్వములనుండి బాగుగ విడువబడినవారును అగు జ్ఞానులు అట్టి అవ్యయమగు బ్రహ్మపదమును ( మోక్షమును ) బొందుచున్నారు . |
అనుష్టుప్ . న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః| యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ|| 15-6 | కందము . దివిటీల కరణిఁ దోచును , ప్రవిమల మగు నాపథంబు భాసిలఁ జేయన్ , రవిచంద్ర పావక ద్యుతి నివృత్తిఁ గనరాని చోటు నిస్తుల పథమున్ . ౬ | ఆ ( పరమాత్మ ) స్థానమును సూర్యుడుగాని , చంద్రుడుగాని , అగ్నిగాని ప్రకాశింపజేయజాలరు . దేనిని పొందినచో ( జనులు ) మఱల ( ఈ సంసారమునకు ) తిరిగిరారో అదియే నాయొక్క శ్రేష్ఠమైన స్థానము ( అయియున్నది ) . |
అ. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః| మనఃషష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి|| 15-7 | తేటగీతి . ప్రాణికోటి మదీయాంశ భవమెయైన , మనసు కర్మేంద్రియము లారు గొని చరింతు , రీ శరీరమ్ములను నాశ్రయించు కొనుచు , ప్రకృతి వశులౌదు రిట్లు నిరంతరంబు . ౭ | నాయొక్కయే అనాదియగు ( నిత్యమగు ) అంశము జీవలోకమందు జీవుడై ప్రకృతియందున్న త్వక్ చక్షు శ్శ్రోత్ర జిహ్వా ఘ్రాణ మనంబు లను ఆఱు ఇంద్రియములను ఆకర్షించుచున్నది . |
అ. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః| గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్|| 15-8 | చంపకమాల . తనువుల దాల్చినప్పుడు , విదిల్చిన యప్పుడు జీవి నిత్యమున్ దన వెనువెంట నింద్రియ వితానము లారిటి గొంచు నేగు , నా యనిలుఁడు సూన వాసనక్రియన్ వెనుకాడుచునుండుఁ , గర్మ వా సనల పరంపరాగమము జన్మల చావుల కారణమ్ము లై . ౮ | ( దేహేంద్రియాది సంఘాతమునకు ) ప్రభువగు జీవుడు శరీరమును విడుచునప్పుడును , నూతన శరీరమును పొందునపుడును - పుష్పాది స్థానములనుండి గాలి వాసనలను గ్రహించిపోవు చందమున - పంచేంద్రియములు , మనస్సు అను ఆఱింటిని గ్రహించి వెడలుచున్నాడు . |
అ. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ| అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే|| 15-9 | తేటగీతి . చెవులు , గన్నులు , జర్మమ్ము , చవులవాయి నాసికయుఁ గూడి యారు మనంబు తోడ దేహములయందు జీవి వర్తించి , విషయ భోగలాలసుఁడై యుండు , మోహితుఁడయి . ౯ | ఈ జీవుడు ( జీవాత్మ ) చెవిని , కంటిని , చర్మమును , ( త్వగింద్రియమును ) నాలుకను , ముక్కును , మనస్సును ఆశ్రయించి ( శబ్దాది ) విషయములను అనుభవించుచున్నాడు . |
అ. ఉత్క్రామన్తం స్థితం వాపి భుఞ్జానం వా గుణాన్వితమ్| విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః|| 15-10 | ఆటవెలది . ఉండి యనుభవమ్ము నొందుచున్నది యేది , పోవునపుడుఁ దరలి పోవు నేది , యెఱుగలేరు మూఢ నరులీ రహస్యమ్ము ; జ్ఞానులైన వారు కానఁ గలరు . ౧౦ | ( ఒక శరీరమునుండి మఱియొక శరీరమునకు ) బయలుదేఱుచున్నవాడును , శరీరమునందున్నవాడును , లేక విషయముల ననుభవించుచున్నవాడును , ( సత్త్వాది ) గుణములతో గూడినవాడునగు ఈ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు ( తెలిసికొన జాలరు ) . జ్ఞానదృష్టిగలవారు మాత్రము చూచుచున్నారు ( తెలిసికొనుచున్నారు ) . ( అనగా ఆ యా క్రియలు జరుపుచున్నపు డాతనిని అజ్ఞులెఱుగజాలరనియు , జ్ఞానులుమాత్ర మెఱుగగలరనియు భావము ) . |
అ. యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్| యతన్తోऽప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః|| 15-11 | ఆటవెలది . జ్ఞానులైనవారు స్వస్వరూపము నందె ఆత్మ నరసి ముదము నందు చుంద్రు ; వికృత మార్గగామి యకృ తాత్ముఁ డగువాఁడు లోఁ గలట్టి యాత్మ నీగలేడు . ౧౧ | ( ఆత్మ సాక్షాత్కారమునకై ) ప్రయత్నము చేయుచున్న యోగులు ( తమయందున్నట్టి ) ఈ ఆత్మను చూచుచున్నారు ( అనుభూతమొనర్చుకొనుచున్నారు ) . అట్లు ప్రయత్నముచేయు చున్న వారైనను చిత్త శుద్ధిలేని అవివేకులు ఈ ఆత్మను చూడజాలకున్నారు . |
అ. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేऽఖిలమ్| యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్|| 15-12 | తేటగీతి . అర్క తేజము , శశి తేజ , మగ్ని తేజ మీ విభాసము లెల్లయు నావె కావె ; సకలము ప్రకాశము నొనరింతు , జగతి నెల్ల తేజముల భాసిలం జేయు తేజ మేనె . ౧౨ | సూర్యునియం దే తేజస్సు ( ప్రకాశము , చైతన్యము ) ప్రపంచమునంతను ప్రకాశింపజేయుచున్నదో , అట్లే చంద్రునియందును , అగ్ని యందును ఏ తేజస్సు గలదో , అదియంతయు నాదిగా నెఱుఁగుము . |
అ. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా| పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః|| 15-13 | తేటగీతి . ధర ప్రవేశించి , నే భూతతతి ధరింతు , దివ్యమగు నా బలంబున , సవ్యసాచి ! సోమ రూపుండనై , రసం బోమి , సకల యోషధుల పుష్టి గూర్చెదనో కిరీటి ! ౧౩ | మఱియు నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను ( నిలుపుచున్నాను ) . రసస్వరూపుడగు చంద్రుడనై సస్యములన్నింటిని పోషించుచున్నాను . |
అ. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః| ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్|| 15-14 | తేటగీతి . ప్రాణికోటుల దేహంబులందు నుండు నల్ల వైశ్వానరుండ , జఠరాగ్ని నేనె ; ప్రాణము నపానవాయువుల్ పదిలపఱచి , నలువిధంబుల యన్నముల్ బచనపఱతు . ౧౪ | నేను ' వైశ్వానరుడ ' ను జఠరాగ్నిగానయి ప్రాణులయొక్క శరీరమును ఆశ్రయించి ప్రాణాపానవాయువులతో గూడుకొని నాలుగు విధములగు అన్నమును పచనము చేయుచున్నాను . |
ఇంద్రవజ్ర . సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనఞ్చ| వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్|| 15-15 | తేటగీతి . ప్రాణికోటుల హృదయాంతరముల నుండి , స్మృతియు , విస్మృతి , జ్ఞాన మిచ్చెదను నేనె ; వేదములు నేనె , వేదాంత వేద్యుఁ డేనె , సకల వేదాంతముల ప్రవర్తకుఁడ నేనె . ౧౫ | నేను సమస్త ప్రాణులయొక్క హృదయమందున్నవాడను ; నావలననే ( జీవునకు ) జ్ఞాపకశక్తి , జ్ఞానము ( తెలివి ) , మఱపు కలుగుచున్నవి . వేదము లన్నిటి చేతను తెలియదగినవాడను నేనే అయియున్నాను . మఱియు వేదము నెఱిఁగినవాడనుగూడ నేనే అయియున్నాను . |
అ. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ| క్షరః సర్వాణి భూతాని కూటస్థోऽక్షర ఉచ్యతే|| 15-16 | తేటగీతి . పురుషు లిరువురు , క్షరుఁడు నక్షరుఁడు ననగ క్షరము భూతముల్ , దేహి యక్షరుఁడు , పార్థ ! అల పరాపర ప్రకృతి ద్వయము , కిరీటి ! యీ ద్వయంబగు పురుషుల నెఱిగి కొనుము . ౧౬ | ప్రపంచమునందు క్షరుడనియు , అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు . అందు సమస్త ప్రాణులయొక్క దేహములు ( ఉపాధులు ) క్షరుడనియు , కూటస్థుడగు జీవుడు అక్షరుడనియు చెప్పబడుచున్నారు . |
అ. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుధాహృతః| యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః|| 15-17 | తేటగీతి . ప్రకృతి పురుషులకు నతీతుఁ డొకఁడు కలఁడు , అతఁడె ముల్లోకముల భర్త యవ్యయుండు ; నుత్తమోత్తముఁ డా పురుషోత్తముండు , వేద వేదాంతములయందు వినుతిగాంచు . ౧౭ | ఎవడు మూడులోకములందును ప్రవేశించి వానిని భరించుచచున్నాడో , అట్టి నాశరహితుడును , జగన్నియామకుడును , ( పైన దెల్పిన క్షరా క్షరులిద్దఱికంటెను ) వేఱైనవాడును నగు ఉత్తమపురుషుడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు . |
అ. యస్మాత్క్షరమతీతోऽహ మక్షరాదపి చోత్తమః| అతోऽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః|| 15-18 | తందము . క్షరునకుఁ బరమై , యల య క్షరున కతీతుండ నయిన కతమున నన్నున్ స్థిరచిత్త భక్తి యుక్తులు పురుషోత్తముఁడని నుతింత్రు ముల్లోకములన్ . ౧౮ | నేను క్షర స్వరూపునికంటె మించినవాడను , అక్షర స్వరూపుని ( జీవుని ) కంటె శ్రేష్ఠుడను అయి యున్నందువలన ప్రపంచమునందును , వేదమునందును ' పురుషోత్తము ' డని ప్రసిద్ధి కెక్కియున్నాను . |
అ. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్| స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత|| 15-19 | చంపకమాల . స్తుతు లొనరించి , నన్ను పురుషోత్తముఁ డంచు నెఱింగి కొన్న యా యతులిత భక్తుఁడే గనెడు నన్నిట నన్ను చరాచరంబు , లే వితమగు మోహముం గనక ; విశ్వమయున్ సకలాత్మకుండ భూ తతతి స్వరూపుఁడౌ నను సతంబు భజించుచు నుండు , భారతా ! ౧౯ | ఓ అర్జునా ! ఎవడు అజ్ఞానము లేనివాడై , ఈ ప్రకారముగ నన్ను పురుషోత్తమునిగా నెఱుఁగుచున్నాడో , అతడు సమస్తమును దెలిసినవాడగుచు పూర్తి మనస్సుతో ( సర్వవిధముల ) నన్ను భజించుచున్నాడు . |
అ. ఇతి గుహ్యతమం శాస్త్ర మిదముక్తం మయానఘ| ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్ కృతకృత్యశ్చ భారత ! || 15-20 | కందము . అతి గుహ్యంబగు శాస్త్రపు విత మెల్లనుఁ బల్కితిని ; వివేకముఁ గనుచున్ , మతిమంతుఁడై యెఱింగిన , కృత కృత్యుఁడు వాఁడె పో కిరీటి ! జగమునన్ . ౨౦ | పాపరహితుడవగు ఓ అర్జునా ! ఈ ప్రకారముగ అతి రహస్యమైనట్టి ఈ శాస్త్రమును నీకు చెప్పితిని . దీనిని చక్కగా తెలిసికొనినవాడు జ్ఞానవంతుడును , కృతకృత్యుడును కాగలడు . |
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పఞ్చదశోऽధ్యాయః|| 15 || | ఓం తత్ సత్ .ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీ విశ్వనాథ శాస్త్రిచే యనువదింపబడినశ్రీ గీతామృత తరంగిణి యందు శ్రీ పురుషోత్తమ ప్రాప్తి యోగ నామ పంచాదశ తరంగము సంపూర్ణము . శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. | ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మ విద్యయు , యోగ శాస్త్రమును , శ్రీకృష్ణార్జున సంవాదమునగు పురుషోత్తమ ప్రాప్తియోగమను పదునైదవ అధ్యాయము సంపూర్ణం. ఓమ్ తత్ సత్ . |
Thursday, October 29, 2009
శ్రీ విభూతి యోగము
| శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) | శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు) శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952) | గీతా మకరందము(తెలుగు తాత్పర్యము) శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979) |
|---|---|---|
| శ్రీభగవానువాచ| అనుష్టుప్. భూయ ఏవ మహాబాహో ! శృణు మే పరమం వచః| యత్తేऽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా|| 10-1 | శ్రీ భగవానుల వాక్యము. తేటగీతి. నా పలుకుల నాలించి , సంతసము నొందు నీకుఁ జెప్పెద మఱల , దానినె కిరీటి ! నీ హితంబునుఁ గోరుచు , నే వచింతు సావధానుండవై విను , సవ్యసాచి ! ౧ | గొప్ప భుజములుగల ఓ అర్జునా ! ( నా మాటలు విని ) సంతసించుచున్న నీకు హితమును కలుగజేయు నుద్దేశముతో మఱల ఏ శ్రేష్ఠమగు వాక్యమును నేను చెప్పబోవు చున్నానో , దానిని వినుము . |
| అ. న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః| అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః|| 10-2 | తేటగీతి. నాదు శక్తి యుత్పత్తి బ్రహ్మాదులకును నల మహర్షుల కేనియుఁ దెలియరాదు , సర్వదేవులు భృగ్వాది సంయములకు ; నాది దేవుండ మూలమంతటికి నేనె . ౨ | నా యొక్క ఉత్పత్తిని ( అవతార రహస్యమును , లేక , ప్రభావమును ) దేవగణము లెఱుఁగవు . మహర్షులున్ను ఎఱుఁగరు . ( ఏలయనిన ) నేను ఆ దేవతలకును , మహర్షులకును సర్వవిధముల మొదటివాడను ( కారణభూతుడను ) గదా ! |
| అ. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్| అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే|| 10-3 | చంపకమాల. ఎవఁడు సనాతనుం డజుఁడ నే నెయటంచుఁ దలంచుచుండునో , యెవఁడు జగత్ప్రభుండనని యెంచి ననున్ భజియించుచుండునో , తవులడు పాపకర్మల పథంబుల నెప్డు ; విముక్తుఁ డైన బ్ర హ్మవిదుఁ డతండె జుమ్ము ; పరమార్థము దీని వినంగఁ జెప్పితిన్ . ౩ | ఎవడు నన్ను పుట్టుకలేనివానిగను , అనాదిరూపునిగను , సమస్తలోకములకు నియామకునిగను తెలుసుకొనుచున్నాడో , అతడు అజ్ఞానము లేనివాడై సర్వపాపములనుండి లెస్సగ విడువబడుచున్నాడు . |
| అ. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః| సుఖం దుఃఖం భవోऽభావో భయం చాభయమేవ చ|| 10-4 అ. అహింసా సమతా తుష్టి స్తపో దానం యశోऽయశః| భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః|| 10-5 | తేటగీతి. బుద్ధి , జ్ఞానము , సమ్మోహములును మఱియు శమ , దమ , క్షమాదులును , సత్యమును , సుఖము , దుఃఖమునుఁ , జావు , పుట్టుకల్ , దురితభయము , నభయము , నహింస , సమచిత్త మలరుటయును . ౪ తేటగీతి. తుష్టిఁ గనుచుండుటయు , తపో నిష్ఠ నుంట , యీవి , కీర్తి , యకీర్తియు , జీవులకును వివిధ భావోద్భవంబులు విశ్రుతముగ నా వలనె కల్గు పార్థ ! యనారతంబు. ౫ | బుద్ధి , జ్ఞానము , మోహరాహిత్యము , ఓర్పు , సత్యము , బాహ్యేంద్రియ నిగ్రహము , అంతరింద్రియ నిగ్రహము , సుఖము , దుఃఖము , పుట్టుక ( ఉత్పత్తి ) , నాశము , భయము , భయములేకుండుట , అహింస , సమత్వము , సంతుష్టి , తపస్సు , దానము , కీర్తి , అపకీర్తి , ప్రాణులయొక్క ఈ ప్రకారములైన నానావిధములగు గుణములు నా వలననే కలుగుచున్నవి . |
| అ. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా| మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః|| 10-6 | కందము. నలువురు మనువులు సప్త ర్షులు మద్భావమ్మునన్ ప్రచోదితులై భూ స్థలిఁ గల ప్రజల సృజించిరి , కలిగిరి మద్భావ కలన కలిమిని పార్థా ! ౬ | లోకమునం దీ ప్రజలు యెవరియొక్క సంతతియై యున్నారో అట్టి పూర్వీకులైన సప్త మహర్షులున్ను , సనకాదులైన నలుగురు దేవర్షులున్ను , మనువులు పదునలుగురున్ను , నా యొక్క భావము ( దైవ భావము ) గలవారై నా యొక్క మనస్సంకల్పము వలననే పుట్టిరి . |
| అ. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః| సోऽవికమ్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః|| 10-7 | కందము. స్థితిలయముల సృష్టి జగ త్పతినౌ నావలనె జగము వర్తిలు నంచున్ , మతి నెంచు బుధులు నన్నే స్తుతియించి , భజించుచుంద్రు , శుద్ధమనమునన్. ౭ | నా యొక్క విభూతిని ( ఐశ్వర్యమును , విస్తారమును ) , యోగమును ( అలౌకిక శక్తిని ) , ఎవడు యథార్థముగ తెలిసికొనుచున్నాడో అతడు నిశ్చలమగు యోగముతో కూడుకొనుచున్నాడు . ఇవ్విషయమున సందేహము లేదు . |
| అ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే| ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితాః|| 10-8 అ. మచ్చిత్తా మద్గతప్రాణా బోధయన్తః పరస్పరమ్| కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ|| 10-9 | ఉత్పలమాల. నాయెడఁ జిత్తమున్ నిలిపి , నాకయి కర్మల నాచరించు , నా ధీయుతులైన వారలు నుతింత్రు పరస్పర బోధనా రతిన్ , వాయికొలంది వే విధుల బ్రస్తుతిఁ జేయుచు , సంతసింపుచున్ రేయిఁబవల్ నిరంతరము క్రీడలొనర్తురు , నన్ దలంచుచున్ . ౮ | ' నేను సమస్తజగత్తునకుఉత్పత్తికారణమైనవాడను , నా వలననే ఈ సమస్తము నడచుచున్నది ' అని వివేకవంతులు తెలిసికొని పరిపూర్ణ భక్తిభావముతో గూడినవారై నన్ను భజించుచున్నారు . ( వారు ) నా యందు మనస్సుగలవారును , నన్ను బొందిన ప్రాణములు ( ఇంద్రియములు ) కలవారును , ( లేక నా యెడల ప్రాణము నర్పించిన వారును ) అయి నన్నుగూర్చి పరస్పరము బోధించుకొనుచు , ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడును సంతృప్తిని , ఆనందమును బొందుచున్నారు . |
| అ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్| దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తి తే|| 10-10 అ. తేషామేవానుకమ్పార్థ మహమజ్ఞానజం తమః| నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా|| 10-11 | ఉత్పలమాల. జ్ఞాన సముద్భవంబగును నాకృపచే సుగుణాళికిన్ , ననున్ బూని తరింపగాఁ గలుగు బుద్ధి విశేషములెల్ల నిచ్చెదన్ ; నేను వసింతు వారి కమనీయ సుహృత్కమలంబులందుఁ , జే నూనెద జ్ఞానదీపిక మహోత్కట దుస్థితిఁ బాఱద్రోలగన్. ౯ | ఎల్లప్పుడు నాయందు మనస్సుగలవారై , ప్రీతితో నన్ను భజించునట్టివారికి -- దేనిచో వారు నన్ను పొందగలరో -- అట్టి జ్ఞానయోగమును ( ఆత్మానాత్మ వివేచనాశక్తిని ) ప్రసాదించుచున్నాను . వారలకు ( అట్టి భక్తులకు ) దయజూపుట కొఱకు నేనే వారి యంతః కరణమునందు నిలిచి ప్రకాశమానమగు జ్ఞానదీపముచేత , అజ్ఞానజన్యమగు అందకారమును నశింపజేయుచున్నాను . |
| అర్జున ఉవాచ| అ. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్| పురుషం శాశ్వతం దివ్య మాదిదేవమజం విభుమ్|| 10-12 అ. ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా| అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే|| 10-13 | అర్జును వాక్యము. కందము. పర మోత్కృష్టంబగు గతి , పరమాత్మయు , దివ్యధాముఁ బరమపురుషు గా , నిరుపమ శాశ్వతుఁ , డజుఁడని , యెఱిగించిరి నిన్ను మునులు , ఋషులు ముకుందా ! ౧౦ తేటగీతి. ఆది దేవుండ వీవని , యజుఁడ వనియు , విభుఁడవంచు , మహత్తర విశ్వరూపుఁ డనుచుఁ , జెప్పిరి మును నారదాది ఋషులు , అసితుఁడును , దేవలుండును , వ్యాసకవియు . ౧౧ | అర్జునుడు చెప్పెను. నీవు పరబ్రహ్మమవు , పరంధాముడవు ( పరమపదమవు లేక గొప్ప తేజస్స్వరూపుడవు ) , పరమపావనుడవు . నిన్ను నిత్యునిగను , ప్రకాశరూపునిగను , పరమ పురుషునిగను , ఆదిదేవునిగను , జన్మరహితునిగను , సర్వవ్యాపకునిగను , ఋషులందఱున్ను , దేవర్షి యగు నారదుడున్ను , అసితుడున్ను , దేవలుడున్ను , వేదవ్యాస మహర్షియు చెప్పుచున్నారు . స్వయముగ నీవున్ను ఆ ప్రకారమే ( నిన్ను గూర్చి ) నాకు చెప్పుచున్నావు . |
| అ. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ| న హి తే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవాః|| 10-14 | తేటగీతి. నీవుఁ గూడను నటు వచియింతు , విపుడు చెప్పినది సత్యమని విశ్వసింతు నేను ; దివ్యమగు నీ ప్రభావమ్ముఁ దెలియలేరు , దేవదానవులైనను , దేవ దేవ ! ౧౨ | ఓ కృష్ణా 1 దేనిని నీవు నాకు చెప్పుచున్నావో అదియంతయు సత్యమని నేను తలంచుచున్నాను . ఓ భగవంతుడా ! నీయొక్క ( నిజ ) స్వరూపమును దేవతలుగాని , అసురులుగాని ఎఱుంగజాలరు కదా ! |
| అ. స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ| భూతభావన భూతేశ ! దేవదేవ జగత్పతే|| 10-15 | తేటగీతి. దేవ దేవ ! జగత్పతే ! నీ విభూతి భువనముల యందెటుల్ వ్యాప్తిఁ బొందు చుండు ; నీ వెఱుంగఁగ వలయుఁ గా , కేరికైన వశముఁ గాదు ; నీవే చెప్పవలయు గృష్ణ ! ౧౩ | ఓ పురుషశ్రేష్ఠుడా , సమస్తప్రాణులను సృష్టించువాడా , సకల జీవులకు నియామకుడగువాడా , దేవతలకును దేవుడైనవాడా , జగన్నాథుడా , నిన్ను నీవే యెఱుఁగుదువు ( నీ స్వరూప మితరులకు దుర్గ్రాహ్యమని భావము ) . |
| వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః| యాభిర్విభూతిభిర్లోకా నిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి|| 10-16 అ. కథం విద్యామహం యోగిం స్త్వాం సదా పరిచిన్తయన్| కేషు కేషు చ భావేషు చిన్త్యోऽసి భగవన్మయా|| 10-17 అ. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన| భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేऽమృతమ్|| 10-18 | ఉత్పలమాల. నీ విభవ ప్రభావమును నే నెఱుగంగ ; వచింపు సర్వమున్ నీ వెటులే పదార్థముల నెక్కుడుగాఁ గనుపించుచుందు , వే భావనతో భజింపగ నుపాస్యుఁడవో , విపులీకరింపు ; నా నా విధి విన్ననుం దనివి నందదు , నీ యమృతంపు సూక్తులన్ . ౧౪ | కావున ఏ విభూతులచే ( మాహాత్మ్య విస్తారములచే ) నీ వీ లోకములన్నింటిని వ్యాపించియున్నావో అట్టి దివ్యములగు నీ విభూతులను సంపూర్ణముగ చెప్పుటకు నీవే తగుదువు . యోగేశ్వరా ! నే నెల్లప్పుడును ఏ ప్రకారముగ ధ్యానించుచు నిన్ను తెలిసికొనగలను ? భగవంతుడా ! ఏయే వస్తువులందు నిన్ను నేను ధ్యానింపవలెను ? ఓ కృష్ణా ! నీ యొక్క యోగమహిమను , జగల్లీలావిభూతులను , ( ధ్యానింపదగిన వస్తువులను ) సవిస్తరముగ తెలియజేయుము . ఏలయనగా నీ యొక్క అమృత వాక్యములను వినుచున్న నాకు సంతృప్తి కలుగుట లేదు . ఇంకను వినవలయునని కుతూహలము కలుగుచున్నది . |
| శ్రీభగవానువాచ| అ. హన్త తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః| ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ ! నాస్త్యన్తో విస్తరస్య మే|| 10-19 | శ్రీ భగవానుల వాక్యము. తేటగీతి. అటులె కౌంతేయ ! చెప్పెద నాలకింపు మా ! విభూతుల ప్రాముఖ్యమైన వాని ; సకలమునుఁ జెప్ప సావకాశమ్ము లేదు , సాంతమున్ లేదు సర్వమ్ము సంస్మరింప . ౧౫ | శ్రీ భగవానుడు చెప్పెను. కురువంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఇప్పుడు దివ్యములైన నాయొక్క విభూతులను ( ప్రాధాన్యత ననుసరించి ముఖ్యములైన వానిని ) నీకు చెప్పెదను . ఏలయనగా - నా యొక్క విభూతి విస్తారమునకు అంతము లేదు . |
| అ. అహమాత్మా గుడాకేశ ! సర్వభూతాశయస్థితః| అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ|| 10-20 | తేటగీతి. ప్రాణికోటుల హృదయ నివాసి నగుచు , నధివసింతు గుడాకేశ ! యనిశమేనె ; కర్త , సంరక్షకుఁడను , సంహర్తనగుచు , నన్నిటను నాది మధ్యాంతమగుదు , నేనె . ౧౬ | ఓ అర్జునా ! సమస్త ప్రాణులయొక్క హృదయమునందున్న ప్రత్యగాత్మను నేనే అయియున్నాను .మఱియు ప్రాణులయొక్క ఆదిమధ్యాంతములున్ను( సృష్టిస్థితిలయములున్ను ) నేనే అయియున్నాను. |
| అ. ఆదిత్యానామహం విష్ణు ర్జ్యోతిషాం రవిరంశుమాన్| మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ|| 10-21 | తేటగీతి. ద్వాదశాదిత్యులను విష్ణువౌదు నేనె , తేజములయందు రవి నేనె , దివిని వెలుఁగు తారలందు శశాంకునై తనరు దేనె , యల మరీచి మరుత్తుల నగుదు నేనె . ౧౭ | నేను ఆదిత్యులలో విష్ణువనువాడను , ప్రకాశింపజేయువానిలో కిరణములు గల సూర్యుడను. మరుత్తులను దేవతలలో మరీచియనువాడను , నక్షత్రములలో చంద్రుడను అయియున్నాను . |
| అ. వేదానాం సామవేదోऽస్మి దేవానామస్మి వాసవః| ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా|| 10-22 | తేటగీతి. వేదముల సామవేదంబు నౌదు నేనె , సర్వ దేవతలందు వాసవుఁడ నేనె ; యింద్రియ వితానమున మనసేనె పార్థ ! భూతచయముల నేనౌదు , చేతనమ్ము ! ౧౮ | నేను వేదములలో సామవేదమును , దేవతలలో ఇంద్రుడను , ఇంద్రియములలో మనస్సును , ప్రాణులలో చైతన్యమున్ను ( తెలివి ) అయియున్నాను . |
| అ. రుద్రాణాం శఙ్కరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్| వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్|| 10-23 అ. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ ! బృహస్పతిమ్| సేనానీనామహం స్కన్దః సరసామస్మి సాగరః|| 10-24 | తేటగీతి. రుద్రగణముల నే శంకరుండ పార్థ ! యక్షరాక్షసులం దలకాధిపతిని ; అష్ట వసువుల పావకుం డగుదు నేనె ; శిఖరములయందు నే మేరు శిఖర మగుదు . ౧౯ తేటగీతి. వరపురోహితులన్ బృహస్పతిని నేనె ; నేనె స్కందుండ వాహినీ నేతలందు ; నప్పులందున సాగరుండగుదు నంచు , దెలిసి కొను మీవు మదినిఁ గుంతీ తనూజ ! ౨౦ | నేను రుద్రులలో శంకరుడనువాడను , యక్షులలోను , రాక్షసులలోను కుబేరుడను , వసువులలో అగ్నియు, పర్వతములలో మేరువును అయియున్నాను . ఓ అర్జునా ! పురోహితులలో శ్రేష్ఠుడగు బృహస్పతిగా నన్నెఱుఁగుము. మఱియు నేను సేనాపతులలో కుమారస్వామియు , సరస్సులలో సముద్రమును అయియున్నాను . |
| అ. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్| యజ్ఞానాం జపయజ్ఞోऽస్మి స్థావరాణాం హిమాలయః|| 10-25 | తేటగీతి. మహిత ఋషులందు నే భృగు నౌదు పార్థ ! అక్షరంబుల నోం కార మౌదు నేను యజ్ఞముల నేను జపయజ్ఞమని తెలియుము అచలములలోన హిమవంతు నౌదు సుమ్ము ! ౨౧ | నేను మహర్షులలో భృగుమహర్షిని , వాక్కులలో ఏకాక్షరమగు ప్రణవమమను ( ఓంకారమును ) , యజ్ఞములలో జపయజ్ఞమును , స్థిరపదార్థములలో హిమాలయపర్వతమును అయియున్నాను . |
| అ. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః| గన్ధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః|| 10-26 | తేటగీతి. భూజములయందు నశ్వథ్థ భూజమగుదు ; ప్రథిత దేవర్షులందు నారదుఁడ నేనె ; రామ గంధర్వులన్ జిత్రరథుఁడ నేనె ; సిద్ధమునులఁ గపిలుఁడన్ ప్రసిద్ధి నేనె . ౨౨ | నేను చెట్లన్నిటియందును రావిచెట్టును , దేవర్షులలో నారదుడను , గంధర్వులలో చిత్రరథుడను , సిద్ధులలో కపిలమునీంద్రుడను అయియున్నాను . |
| అ. ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్| ఐరావతం గజేన్ద్రాణాం నరాణాం చ నరాధిపమ్|| 10-27 | తేటగీతి. అమృత మథనంబునం దది యవతరించె అశ్వములను నుచ్చైశ్రవ మగుదు నేనె ; గజములందు నైరావత గజము నేనె ; నరులను నరేశ్వరుండ శంతను ప్రపౌత్ర ! ౨౩ | గుఱ్ఱములలో అమృతముతోపాటు పుట్టిన ఉచ్చైశ్రవమను గుఱ్ఱమునుగను , గొప్ప యేనుగులలో ఐరావతమను గొప్ప యేనుగునుగను , మనుష్యులలో రాజునుగను నన్ను తెలిసికొనుము . |
| అ. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్| ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః|| 10-28 | తేటగీతి. ఆయుధముల వజ్రాయుధ మగుదు నేనె ; ధేనులన్ గామధేనువు నేనె పార్థ ! సృష్టి మూలంబు కందర్పుఁ డేనె విజయ ! సర్పములయందు వాసుకిన్ సవ్యసాచి ! ౨౪ | నేను ఆయుధములలో వజ్రాయుధమును , పాడియావులలో కామధేనువును , ప్రజల ( ధర్మబద్ధమగు ) యుత్పత్తికి కారణభూతుడైన మన్మథుడను , సర్పములలో వాసుకియు అయియున్నాను . |
| అ. అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్| పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్|| 10-29 | తేటగీతి. నాగములయందు నేనె యనంతు నగుదు ; సలిల దేవుల వరుణుఁడన్ దెలియుమయ్య ; పితరులను నర్యముండని పిలువఁబడుదు ; నిగ్రహంబున జముఁడన నేనె పార్థ ! ౨౫ | నేను నాగులలో అనంతుడను , జలదేవతలలో వరుణుడను , పితృదేవతలలో అర్యమయు , నియమించువారిలో యముడను అయియున్నాను . |
| అ. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్| మృగాణాం చ మృగేన్ద్రోऽహం వైనతేయశ్చ పక్షిణామ్|| 10-30 | తేటగీతి. అతుల ప్రహ్లాదుఁడన్ దితి సుతులలోన ; నాయువు గణించు వారల నౌదుఁ గాలు ; మృగ గణంబుల సింహేంద్ర మేనె పార్థ ! పక్షులన్ గరుత్మంతునై పరగు దేనె . ౨౬ | నేను అసురులలో ప్రహ్లాదుడను , లెక్కపెట్టువారిలో కాలమును , మృగములలో మృగరాజగు సింహమును , పక్షులలో గరుత్మంతుడను అయియున్నాను . |
| అ. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్| ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ|| 10-31 | తేటగీతి. పావన మొనర్చు వారలఁ బవను నేనె ; శస్త్రధరులందు శ్రీరామచంద్రు నేనె ; జంతువుల మకరంబు నంచెంతురు నను ; నదులయందు నే జాహ్నవీ నదిని పార్థ ! ౨౭ | నేను పవిత్ర మొనర్చువానిలో ( లేక వేగవంతులలో ) వాయువును , ఆయుధమును ధరించినవారిలో శ్రీరామచంద్రుడను , చేపలలో మొసలిని , నదులలో గంగానదిని అయియున్నాను . |
| అ. సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జున| అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్|| 10-32 | తేటగీతి. ఆది మధ్యాంతములు సృష్టియందు నేనె ; విద్యలన్నిట నే బ్రహ్మ విద్య నగుదు ; విషయ నిర్ణయమం దుద్భవించు వాద కలన మెల్లను నే , నంచుఁ దెలియుమయ్య ! ౨౮ | ఓ అర్జునా ! సృష్టులయొక్క ఆదిమధ్యాంతములు ( ఉత్పత్తి , స్థితి , లయములు ) నేనే అయియున్నాను . మఱియు విద్యలలో అధ్యాత్మవిద్యయు , వాదించువారిలో ( రాగద్వేషరహితముగ , తత్త్వనిశ్చయము కొఱకు చేయబడు ) వాదమును నేనై యున్నాను . |
| అ. అక్షరాణామకారోऽస్మి ద్వన్ద్వః సామాసికస్య చ| అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః|| 10-33 | తేటగీతి. అల ' అ ' కారంబు నే వర్ణములను పార్థ ! ద్వంద్వమౌదు సమాసంబులందు నేను ; అక్షయంబగు కాలంబు నగుదు నేను ; చేతనంబులకున్ సర్వధాత నేనె . ౨౯ | నేను అక్షరములలో ' అ ' కారమును , సమాసములలో ద్వంద్వ సమాసమును అయియున్నాను . మఱియు నాశము లేని కాలమును ( కాలమునకు కాలమైనట్టి పరమేశ్వరుడను ) , సర్వత్ర ముఖములుగల కర్మఫలప్రదాతయును , ( లేక విరాట్స్వరూపుడగు బ్రహ్మదేవుడను ) నేనే అయియున్నాను . |
| అ. మృత్యుః సర్వహరశ్చాహ ముద్భవశ్చ భవిష్యతామ్| కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా|| 10-34 | తేటగీతి. జీవకోటుల మృత్యువై చెలఁగు దేనె ; భవితముల కెల్ల హేతువు నగుదు నేనె ; స్త్రీజనంబుల యందుఁ గీర్తి యును ధృతియు శ్రీ , స్మృతియు , వాక్కు మేధలై చెలఁగు దేనె . ౩౦ | సమస్తమును సంహరించునట్టి మృత్యువును , ఇకముందు ఉత్పత్తి కాగల సమస్తముయొక్క పుట్టుకయు నేనే అయియున్నాను . మఱియు స్త్రీలలోగల కీర్తి , సంపద , వాక్కు , స్మృతిజ్ఞానము , ధారణాశక్తిగల బుద్ధి , ధైర్యము , ఓర్పు , అను ఈ ఏడుగుణములున్ను నేనే అయియున్నాను . |
| అ. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్దసామహమ్| మాసానాం మార్గశీర్షోऽహ మృతూనాం కుసుమాకరః|| 10-35 | తేటగీతి. సామముల యందు నే బృహత్సామ మౌదు ; ఛందముల యందు గాయత్రి ఛంద మేనె ; మాసముల యందు మృగశిర మాస మేను ; ఋతువులందు వసంత మేనే కిరీటి ! ౩౧ | సామవేదగానములలో బృహత్సామమును , ఛందస్సులలో గాయత్రియు , మాసములలో మార్గశిరమాసమును , ఋతువులలో వసంతఋతువును నేనై యున్నాను . |
| అ. ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్| జయోऽస్మి వ్యవసాయోऽస్మి సత్త్వం సత్త్వవతామహమ్|| 10-36 | తేటగీతి. జూదరులయందు జూదంబు నౌదు నేనె ; తేజమూర్తులయం దుండు తేజ మేనె ; జయము నందెడి వారల జయము నేనె ; బలుల బలమౌదు నే కృషీవలుల కృషియు . ౩౨ | వంచక వ్యాపారములలో నేను జూదమును అయియున్నాను . మఱియు నేను తేజోవంతులయొక్క తేజస్సును ( ప్రభావము ) , ( జయించువారలయొక్క ) జయమును , ( ప్రయత్నశీలురయొక్క ) ప్రయత్నమును , ( సాత్త్వికులయొక్క ) సత్త్వగుణమును అయియున్నాను . |
| అ. వృష్ణీనాం వాసుదేవోऽస్మి పాణ్డవానాం ధనఞ్జయః| మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః|| 10-37 | తేటగీతి. యాదవుల వాసుదేవుండ నౌదు నేనె ; పాండు నందనుల ధనంజయుండ నేనె ; మునుల వ్యాసుండ నేనౌదు వినుము పార్థ ! కవులలో నుశనాకవి నవుదు పార్థ ! ౩౩ | నేను వృష్ణివంశీయులలో వసుదేవుని పుత్రుడగు వాసుదేవుడను ( శ్రీకృష్ణుడను ) , పాండవులలో అర్జునుడను , మునులలో వేదవ్యాస మునీంద్రుడను , కవులలో శుక్రాచార్యుడను అయియున్నాను . |
| అ. దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్| మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్|| 10-38 | తేటగీతి. నర పతు లొనర్చు దమన దండంబు నేనె ; యల జిగీషుల నీతియు నగుదు నేనె ; గోప్యములయందు మౌన నిగూఢ మేనె ; జ్ఞానవంతుల జ్ఞానంబు నేనె పార్థ ! ౩౪ | నేను దండించువారియొక్క దండనమును ( శిక్షయు ) , జయింప నిచ్చగలవారియొక్క ( జయోపాయమగు ) నీతియు , అయియున్నాను . మఱియు రహస్యములలో మౌనమును , జ్ఞానవంతులలో జ్ఞానమును నేనై యున్నాను . |
| అ. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున ! | న తదస్తి వినా యత్స్యా న్మయా భూతం చరాచరమ్|| 10-39 | తేటగీతి. ఈ జగత్తునకున్ సర్వబీజమేనె ; నేను లేని పదార్థ మెందైన లేదు ; నా విభూతికి యవధి యంతములు లేవు ; కౢప్తముగఁ జెప్పితిని నీకుఁ గొంత గొంత . ౩౫ | ఓ అర్జునా ! సమస్త ప్రాణికోట్లకు ఏదిమూలకారణమైయున్నదో అదియు నేనే అయియున్నాను . ( వెయ్యేల ) స్థావరజంగమాత్మకమైన వస్తువేదియు నన్ను వినాగా లేనేలేదు ( నాకంటె వేఱుగ లేదు ) . |
| అ. నాన్తోऽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరన్తప| ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా|| 10-40 అ. యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా| తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంऽశసమ్భవమ్|| 10-41 | కందము. ఎచ్చట శ్రీయు , విభూతియు , ముచ్చట నుత్సాహ గరిమ , మురిపెము గ నెదో యచ్చట మదీయ తేజము హెచ్చుగఁ గానంగఁ గలుగు దీవు కిరీటీ ! ౩౬ | ఓ అర్జునా ! నా యొక్క దివ్యములైన విభూతులకు అంతము లేదు . అయినను కొన్నిటిని సంక్షేపముగ నిట వివరించి చెప్పితిని . ( ఈ ప్రపంచమున ) ఐశ్వర్యయుక్త మైనదియు , కాంతివంతమైనదియు ( నిర్మలమైనదియు ) , ఉత్సాహముతో గూడినదియు ( శక్తివంతమైనదియు ) నగు వస్తువు లేక ప్రాణి ఏది యేది కలదో అది యది నా తేజస్సుయొక్క అంశమువలన కలిగినదానినిగనే నీ వెఱుఁగుము . |
| అ. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున| విష్టభ్యాహమిదం కృత్స్న మేకాంశేన స్థితో జగత్|| 10-42 | కందము. అకలంక విభూతినిఁ గనఁ దికమకపడి వినఁగ నేలఁ , ద్రిదివంబులు నే సకల చరాచర జగములు నొకకళచే సంగ్రహించి యుంటిఁ గిరీటీ ! ౩౭ | అర్జునా ! లేక విస్తారమైన ఈ ( విభూతి ) జ్ఞానముచే నీ కేమి ప్రయోజనము ? నేనీ జగత్తునంతను ఒక్క అంశముచేతనే వ్యాపించియున్నాను ( అని తెలిసికొనుము ) . |
| ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే విభూతియోగో నామ దశమోऽధ్యాయః|| 10 || | ఓం తత్ సత్ శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి చే యనువదింపబడిన శ్రీ గీతామృత తరంగిణి యందలి శ్రీ విభూతి యోగము అను దశమ తరంగము సంపూర్ణం. శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణ మస్తు. | ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మనిద్యయు , యోగ శాస్త్రమును , శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు విభూతి యోగమను పదియవ అధ్యాయము సంపూర్ణము. ఓమ్ తత్ సత్ |
Monday, October 26, 2009
రాజవిద్యా రాజగుహ్య యోగము
| శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) | శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు) శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952) |
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము) శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979) |
|---|---|---|
|
శ్రీభగవానువాచ| అనుష్టుప్. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే| జ్ఞానం విజ్ఞానసహితం యజ్జ్ఞాత్వా మోక్ష్యసేऽశుభాత్|| 9-1 |
శ్రీ భగవానుల వాక్యము. కందము. పరమ రహస్య మ్మిది యెరిగింతును నీకు , పార్థ ! యిది తెలిసినచో, పరిపూర్ణ శుభములందుచుఁ , దిరిగిక జన్మంబు లేని తెన్ను గనఁగనౌ . ౧ |
శ్రీ భగవంతుడు చెప్పెను. ( ఓ అర్జునా ! ) దేనిని తెలిసికొనినచో అశుభ రూపమగు ఈ సంసారబంధమునుండి నీవు విడివడుదువో అట్టి అతిరహస్యమైన , అనుభవజ్ఞానసహితమైన ఈ బ్రహ్మజ్ఞానమును అసూయలేనివాడవగు నీకు లెస్సగా జెప్పుచున్నాను ( వినుము ) . |
|
అనుష్టుప్. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్| ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్|| 9-2 |
తేటగీతి. అనుసరింపఁగ సులభమైనను రహస్య రాజమియ్యది ; విద్యల రాజమౌచు , నవ్యయంబును , విహిత ధర్మార్థదమ్ముఁ గాంచ నగును , ముంజేతి కంకణము భంగి . ౨ |
ఈ బ్రహ్మజ్ఞానము విద్యలలోకెల్ల శ్రేష్ఠమైనదియు , రహస్యములలోకెల్ల అతిరహస్యమైనదియు , ధర్మయుక్తమైనదియు , ప్రత్యక్షముగ తెలియదగినదియు , అనుష్ఠించుటకు మిగుల సులభమైనదియు , నాశరహితమైనదియు అయియున్నది . |
|
అ. అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరన్తప| అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసారవర్త్మని|| 9-3 |
తేటగీతి. ఇట్టి విజ్ఞాననమును మూఢుఁ డెఱుగ లేక , నన్నుఁ గన నేఱఁ డెన్ని జన్మములనైనఁ ; గుమ్మరావమ్ము సారెపై దిమ్మఁ దిరిగి , చచ్చి పుట్టును , చర్విత చర్వణముగ . ౩ |
ఓ అర్జునా ! ఈ ( ఆత్మజ్ఞానమను ) ధర్మమునందు శ్రద్ధలేనట్టి మనుజులు నన్ను పొందనివారై మృత్యురూపమైన సంసారమార్గమునందే మఱలుచున్నారు ( తిరుగు చున్నారు లేక నిక్కముగ వర్తించుచున్నారు ) . |
|
అ. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా| మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః|| 9-4 |
చంపకమాల. సకల చరాచరంబులఁ బ్రసారితమై , నిబిడీకృతంబు మా మకమగు సత్త్వమంచెఱుఁగుమా ! సకలంబును నా స్వరూపమే , ప్రకృతి వశంబు నాకగు పరంతప ! నేను రవంతయేని దా నికి వశమై మెలంగ , నిది నిక్కము, నీవు గ్రహింప జెప్పితిన్. ౪ |
ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడనగు నాచే వ్యాపింపబడి యున్నది . సమస్త ప్రాణికోట్లు నాయందున్నవి . నేను వానియందుండుట లేదు . ( నాకవి ఆధారములు కావు . ) |
|
అ. న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్| భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః|| 9-5 |
కందము. నా దివ్య సత్త్వ సంపద లాధారముఁ గాదు , మఱియు నాధేయముగా లేదీ భూతచయము లా పాదించెడు కితవ భావ బలిమియె సుమ్మా ! ౫ |
ప్రాణికోట్లు నాయందుండునవియు కావు . ఈశ్వర సంబంధమగు నా యీ యోగమహిమను జూడుము . నా యాత్మ ( స్వరూపము ) ప్రాణికోట్ల నుత్పన్నమొనర్చునదియు , భరించునదియు నైనను ఆ ప్రాణులయం దుండుట లేదు . ( వాని నాధారముగ జేసికొని యుండునది కాదు ) . |
|
అ. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్| తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ|| 9-6 అ. సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్| కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్|| 9-7 |
|ఉత్పలమాల. వ్యోమమునందు గాలి యెటులుండి దిగంతము లెల్ల నిండునో , యేమియు నంటకుండు నటు , లీమహి నేను ధరింతు సృష్టినిన్ , బ్రామి , నశింపఁ జేసి , మఱలన్ సృజియింతు , ననారతంబు ; క ల్పామిత సంఖ్య నిట్టు లనయంబునుఁ జర్విత చర్వణమ్ము గా. ౬ |
ఏ ప్రకారముగ అంతటను సంచరించునదియు , గొప్పదియు నగువాయు వెల్లప్పుడును ఆకాశమునందున్నదో , ఆ ప్రకారమే సమస్త ప్రాణికోట్లున్ను నాయందున్నవని తెలిసికొనుము . అర్జునా ! సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలమున నాప్రకృతిని ( మాయను ) జేరి అందు అణగియుండును . తిరిగి సృష్టికాలమున వానిని నేను సృజించుచుందును . |
|
అ. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః| భూతగ్రామమిమం కృత్స్న మవశం ప్రకృతేర్వశాత్|| 9-8 |
కందము. ప్రకృతికి వశమై , భూత ప్రకరంబులు జననమంది , లయ మొందెడు ; మా మక మాయా ప్రకృతి బలం బకలంకము ; భూత తతి తదాధీనమ్మౌ. ౭ |
ప్రకృతికి ( మాయకు లేక స్వకీయకర్మకు ) అధీనమై యుండుటవలన అస్వతంత్రమైనట్టి ఈ సమస్త ప్రాణిసముదాయమును నేను స్వకీయప్రకృతిని అవలంబించి మఱల మఱల సృష్టించుచున్నాను . |
|
అ. న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ| ఉదాసీనవదాసీన మసక్తం తేషు కర్మసు|| 9-9 |
కందము. ఈ మూడు కర్మలం దెటు నేమాత్రము నాకు స్పృహ జనింపక నుందున్ ; ఈ మాయ కర్మ లెవ్వియుఁ జే ముట్టఁగ లేవు దరినిఁ జేరి కిరీటీ ! ౮ |
ఓ అర్జునా ! ( ఆ ప్రకారము జీవులను సృష్టించిన వాడనైనను ) ఆ సృష్ట్యాది కర్మలయందు తగులుకొననివాడనై సాక్షీభూతుడుగ నుండునట్టి నన్ను ఆ కర్మలెవ్వియు బంధింప నేరవు . |
|
అ. మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్| హేతునానేన కౌన్తేయ ! జగద్విపరివర్తతే|| 9-10 |
తేటగీతి. నిర్వికారుడనయ్యు , నా సర్వసాక్షి తత్త్వమే హేతువై జగద్వలయ మెల్ల మోహితంబయి యజ్ఞానమున మునుంగు , ప్రకృతి వశమౌచు నిట్లు నిరంతరంబు . ౯ |
ఓ అర్జునా ! అధ్యక్షుడనై ( సాక్షిమాత్రుడనై ) యున్న నాచేత ప్రకృతి చరాచర ప్రపంచము నంతను సృజించుచున్నది . ఈకారణముచేతనే జగత్తు ప్రవర్తించుచున్నది . |
|
అ. అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్| పరం భావమజానన్తో మమ భూతమహేశ్వరమ్|| 9-11 |
కందము. నా దివ్య తత్త్వ మెఱుఁగఁగ రా , దీమూఢాళి కింత ప్రల్లదులై , యా పాదింత్రు నాకుఁ దనువుల్ , వాదించుచు , బుద్ధి జాడ్య వశవర్తనులై . ౧౦ |
నాయొక్క పరమతత్త్వమునుఎఱుగని అవివేకులు సర్వభూత మహేశ్వరుడను , ( లోకసంరక్షణార్థము ) మనుష్యదేహమును ఆశ్రయించినవాడనునగు నన్ను అవమానించుచున్నారు ( అలక్ష్యము చేయుచున్నారు ) . |
|
అ. మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః| రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః|| 9-12 |
తేటగీతి. దైవ సంబంధమైన స్వభావ మంది , నాశరహితుని భూతాధి నాథు నన్నుఁ , జిత్త మేకాగ్రముగను భజింత్రు సతము , నా మపాత్ములె ప్రియతము లవుదు రయ్య ! ౧౧ |
( అట్టివారు ) వ్యర్థములైన ఆశలుగలవారును , వ్యర్థములైన కర్మలు గలవారును , వ్యర్థమైన జ్ఞానముగలవారును , బుద్ధిహీనులును ( అగుచు ) రాక్షస సంబంధమైనదియు , అసురసంబంధమైనదియునగు స్వభావమునే ఆశ్రయించుచున్నారు . |
|
అ. మహాత్మానస్తు మాం పార్థ ! దైవీం ప్రకృతిమాశ్రితాః| భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్|| 9-13 అ. సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతాః| నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే|| 9-14 |
చంపకమాల. నిరతముఁ గీర్తనల్ సలిపి , నృత్య మొనర్చి , మృదంగ తాళ సం భరితలయల్ సెలంగ , నియమాది యుపాసనలన్ దరించి , కొం దఱు భజియింతు రెప్పుడు నితః పరమెందు గనంగలేక ; న న్నరసి ముదంబుఁ గాంతురు మనమ్మున , భక్తి ప్రభావ యుక్తులై . ౧౨ |
ఓ అర్జునా ! మహాత్ములైతే దైవీప్రకృతిని ( దేవసంబంధమైన స్వభావమును ) ఆశ్రయించినవారలై , నన్ను సమస్తప్రాణులకును ఆదికారణునిగను , నాశరహితునిగను ఎఱిఁగి వేఱొకదానియందు మనస్సునుంచనివారలై నన్నే సేవించుచున్నారు . వారు ( పైనదెల్పిన దైవీప్రకృతి గలవారు ) ఎల్లప్పుడు నన్ను గూర్చి కీర్తించుచు , దృఢవ్రతనిష్ఠులై ప్రయత్నించుచు , భక్తితో నమస్కరించుచు , సదా నాయందు చిత్తముంచినవారలై నన్ను సేవించుచున్నారు . |
|
అ. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే| ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్|| 9-15 |
ఉత్పలమాల. కొందఱు జ్ఞానయజ్ఞమునఁ గొల్తురు పార్థ ! సతమ్ము నన్ను ; సం క్రందన దేవతాళికిని నాకును భేద మెఱుంగకుండఁ గా కొందఱు పూజసల్పుదురు ; కొందఱు నన్ను ననంత రూపునిన్ గందురు , సర్వ దేవతలఁ గా భజియింపుచు వ్యష్టి దృష్టితోన్ . ౧౩ |
మఱికొందఱు జ్ఞానయజ్ఞముచే పూజించుచున్నవారై ( తానే బ్రహ్మమను ) అద్వైతభావముతోను , ఇంక కొందఱు ( బ్రహ్మమే వివిధ దేవతాది రూపమున నున్నది . ఆ దేవతలలో నే నొకదానిని సేవించు చున్నానను ) ద్వైతభావముతోను , ఇట్లనేక విధములుగ ( లేక వివిధరూపముల ) నన్ను ఉపాసించుచున్నారు . |
|
అ. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్| మన్త్రోऽహమహమేవాజ్య మహమగ్నిరహం హుతమ్|| 9-16 |
తేటగీతి. యజ్ఞ సత్కృతులేనె , స్వధాన్న మేనె , ప్రాణులు భుజించు నన్న రూపమ్ము నేనె , పితరులకు దేవతలకు సంప్రీతి నొసఁగు మంత్రములు నేనె యజ్ఞకర్మలఁ , గిరీటి ! ౧౪ |
( అగ్ని ష్టోమాది రూప ) క్రతువు నేనే , యజ్ఞము నేనే , పితృదేవతల కిచ్చు అన్నము నేనే , ఔషధము నేనే , మంత్రము నేనే , హవిస్సు నేనే , అగ్ని నేనే , హోమకర్మమున్ను నేనే అయియున్నాను . |
|
అ. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః| వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ|| 9-17 |
తేటగీతి. యజనములయందు నాజ్యంబు నగుదు నేనె , అనలమును నేనె , హుతచర్య నగుదు నేనె , జగతిఁ దలిదండ్రి దాతను నగుదు నేనె , ఋగ్యజుస్సామ మోంకార మేనె , పార్థ ! ౧౫ |
ఈ జగత్తునకు నేనే తండ్రిని , తల్లిని , సంరక్షకుడను , ( లేక , కర్మఫలప్రదాతను ) , తాతను ; మఱియు తెలిసికొనదగిన వస్తువును , పావన పదార్థమును , ఓం కారమును , ఋగ్వేద , యజుర్వేద , సామవేదములను అయియున్నాను . |
|
అ. గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్| ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్|| 9-18 |
తేటగీతి. కర్మఫలమును , భర్త , జగత్తునకును ఫ్రభుఁడనై , సర్వసాక్షినై , పరగు దేనె ; సర్వజీవులకున్ నివాసంబు నేనె , ఆర్త జనముల రక్షకుఁడగుదు నేనె . ౧౬ తేటగీతి. ఫల రహిత సుహృన్మిత్రునై నిలుతు నేనె , ప్రభ వలయములు , సృష్టి మూలమును నేనె ; నిధియు నిక్షేప బీజమన్నిటికి నేనె ; నాశరహితంబు సత్త్వ మెన్నంగ నేనె . ౧౭ |
పరమ లక్ష్యమును , భరించువాడును , ప్రభువును , ప్రాణుల నివాసమును , శరణమందదగినవాడును , హితమొనర్చువాడును , సృష్టిస్థితిలయకర్తయు , నిక్షేపమును , నాశరహితమైనబీజమును , ( మూలకారణమును ) నేనే అయియున్నాను . |
|
అ. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ| అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ! || 9-19 |
తేటగీతి. ఇలను నినురూపమునఁ దపియింతు నేనె , సలిలము గ్రహించి విడతు వర్షముల గూర్తు ; నమృతమును నేనె , మృత్యువు నగుదు నేనె ; ధరణి సత్తు నసత్తు నై తనరు దేనె . ౧౮ |
ఓ అర్జునా ! నేను ( సూర్యకిరణములచే ) తపింపజేయుచున్నాను . మఱియు వర్షమును కురిపించుచున్నాను . వర్షమును నిలుపుదల చేయుచున్నాను . మరణరాహిత్యమున్ను ( మోక్షమున్ను ) , మరణమును నేనే . అట్లే సద్వస్తువున్ను అసద్వస్తువున్ను నేనే ( అయి యున్నాను ) . |
|
ఇంద్రవజ్ర. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే| తే పుణ్యమాసాద్య సురేన్ద్రలోక- మశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్|| 9-20 ఉపజాతి. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి| ఏవం త్రయీధర్మమను ప్రపన్నా గతాగతం కామకామా లభన్తే|| 9-21 |
ఉత్పలమాల. వేదవిదుల్ మఖంబులను విశ్రుత సోమరసామృతంబు నా స్వాద మొనర్చి , పూతులయి , స్వర్గమునన్ నివసించి , పుణ్య సం పాదన లేశముల్ దరుగ వత్తురు , చర్విత తర్వణంబు లౌ గాదె , యనారతం బిటులఁ గాముకులౌ సుజనాళి కెప్పుడున్ . ౧౯ |
మూడు వేదముల నధ్యయనము చేసినవారును , కర్మకాండను సకామభావముతో నాచరించువారును , సోమపానము గావించినవారును , పాపకల్మషము తొలగినవారునగు మనుజులు యజ్ఞములచే నన్ను పూజించి స్వర్గము కొఱకై ప్రార్ధించుచున్నారు . వారు ( మరణానంతరము ) పుణ్యఫలమగు దేవేంద్రలోకమును బొంది , అట్టి స్వర్గమందు దివ్యములగు దేవభోగముల ననుభవించుచున్నారు . వారు ( అట్టి స్వర్గాభిలాషులు ) విశాలమగు స్వర్గలోకము ననుభవించి పుణ్యము క్షయింప తిరిగి మనుష్యలోకమున జన్మించుచున్నారు . ఈ ప్రకారముగ ( సకామముగ ) వేదోక్తకర్మమును అనుష్ఠించునట్టి ఆ భోగాభిలాషులు రాకపోకడలను ( జననమరణములను ) పొందుచున్నారు . |
|
అ. అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే| తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్|| 9-22 |
ఉత్పలమాల. నన్నె యనన్య చింత మననం బొనరించు , మదీయ భక్తులన్ గన్నుల రెప్పలై యెపుడుఁ గాచుచు నుందును , చెంతనుండి , య భ్యున్నతిఁ గూర్చుచున్ , నిరతమున్ సకలార్థము లేనె యిత్తు నం చెన్నుము ; నా ప్రతిజ్ఞ యిది సిద్ధము , నీ వెఱుగంగఁ జెప్పితిన్. ౨౦ |
ఎవరు ఇతరభావములు లేనివారై నన్నుగూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారో , ఎల్లప్పుడు నాయందే నిష్ఠగల్గియుండు అట్టివారియొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను . |
|
అ. యేऽప్యన్యదేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః| తేऽపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధిపూర్వకమ్|| 9-23 |
ఆటవెలది. అన్య దేవతలను నారాధన మొనర్చు భక్తి యుక్తులైన వారుఁ గూడ , నన్నెఁ జుమ్ము కొలుచు చున్నార , లజ్ఞాన భావమంది నిక్కువమ్ము పార్థ ! ౨౧ |
ఓ అర్జునా ! ఎవరు ఇతరదేవతల యెడల భక్తి గలవారై శ్రద్ధతో గూడి వారి నారాధించుచున్నారో , వారున్ను నన్నే అవిధిపూర్వకముగ ( క్రమముతప్పి ) ఆరాధించుచున్న వారగుదురు . |
|
అ. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ| న తు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే|| 9-24 |
తేటగీతి. సర్వ యజ్ఞ భోక్తను నేనె , స్వామి నేనె ; నన్ను నీ రీతిఁ దెలియకున్నారు వీరు ; నన్నెఱుంగని కారణాంతరము వలన , సుగతి నెఱుంగని ప్రచ్యుతి స్రుక్కువారు . ౨౨ |
ఏలయనగా , సమస్త యజ్ఞములకు భోక్తను , ప్రభువు ( యజమానుడు )ను నేనే అయియున్నాను . అట్టి నన్ను వారు యథార్థముగ తెలిసికొనుట లేదు . ఇందువలన జారిపోవుచున్నారు ( పునర్జన్మను బొందుచున్నారు ) . |
|
అ. యాన్తి దేవవ్రతా దేవాన్ పితౄన్యాన్తి పితృవ్రతాః| భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోऽపి మామ్|| 9-25 |
చంపకమాల. పితరుల , క్షుద్రదేవతలఁ , బీన్గు పిశాచ గణంబు లన్య దే వతల భజించు వారలకు , వారె కనంబడి , ప్రీతి గూర్తు ; ర చ్యుతు ననుఁ బూజఁ జేసెడి మహోదయు లెన్నగ నన్నె పొంది , శా శ్వత పథమందు నుందు రనిశంబు , పరంతప ! చింత గానకన్. ౨౩ |
దేవతల నారాధించువారు దేవతలను , పితృదేవతల నారాధించువారు పితృదేవతలను , భూతముల నారాధించువారు భూతములను , నన్నారాధించువారు నన్నును పొందుచున్నారు . |
|
అ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి| తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః|| 9-26 |
కందము. పత్ర ఫల పుష్ప తోయము లాత్రముతో భక్త తతి సమర్పించిన , యా పత్ర ఫల పుష్ప తోయము లాత్రముతో స్వీకరింతు , నర్జున ! ప్రీతిన్ . ౨౪ |
ఎవడు నాకు భక్తితో ఆకునుగాని , పువ్వునుగాని , పండునుగాని , జలమునుగాని సమర్పించుచున్నాడో అట్టి పరిశుద్ధాంతఃకరణునియొక్క ఆ పత్రపుష్పాదులను నేను ( ప్రీతితో ) ఆరగించుచున్నాను ( అనుభవించుచున్నాను ) . |
|
అ. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్| యత్తపస్యసి కౌన్తేయ ! తత్కురుష్వ మదర్పణమ్|| 9-27 |
కందము. ఎది సలిపిన , నెది తిన్నను , నెది విన్నను , మరియు దాన మెది చేసినఁ , గ న్నది విన్నది తిన్నది నె మ్మదిలో నన్నెన్నుచున్ సమర్పింపవలెన్ . ౨౫ |
ఓ అర్జునా ! నీ వేదిచేసినను , తినినను , హోమమొనర్చినను , దానము చేసినను , తపస్సు చేసినను , దానిని నా కర్పింపుము . |
|
అ. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబన్ధనైః| సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి|| 9-28 |
తేటగీతి. శుభము నశుభము లేని యీ చొప్పు నఱసి , కర్మ లొనరింప నంటవు కర్మ బంధ ములు , పరంతప ! నిష్కామముననుఁ గర్మఁ జేయు మెప్పుడు నీవు , నన్ జేరగలవు . ౨౬ |
ఈ ప్రకారముగ ' కర్మసమర్పణ ' యోగముతో గూడినవాడవై పుణ్యపాపములు ఫలములుగాగల కర్మబంధములనుండి నీవు విడువబడగలవు . అట్లు విడువబడినవాడవై నన్ను పొందగలవు . |
|
అ. సమోऽహం సర్వభూతేషు న మే ద్వేష్యోऽస్తి న ప్రియః| యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్|| 9-29 |
ఉత్పలమాల. నాకు సమానదృష్టినిఁ గనంబడు భూత చయమ్ము లెల్ల , ద్వే షైక సరాగ భావముల చందము లేదు , మదీయ రూపమే లోకము లెల్లఁ గావున ; విలోలత నన్ భజియించు వానికిన్ నాకును భేదమేమియుఁ గనంబడకుండెద , మొక్క రూపునన్. ౨౭ |
నేను సమస్త ప్రాణులందును సమముగా నుండువాడను . నాకొకడు ద్వేషింపదగినవాడుగాని , మఱియొకడు ఇష్టుడుగాని ఎవడును లేడు . ఎవరు నన్ను భక్తితో సేవించుదురో వారు నాయందును , నేను వారియందును ఉందుము . |
|
అ. అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్| సాధురేవ స మన్తవ్యః సమ్యగ్వ్యవసితో హి సః|| 9-30 అ. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి| కౌన్తేయ ! ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి|| 9-31 |
ఉత్పలమాల. పాపము లాచరించి , పిదపన్ దెలివొంది , గతంబునందు సం తాపమునొంది , నన్నె సతతంబు భజించి , యనన్యభక్తి నా ప్రాపునుఁ గోరు భక్తతతి పావనులంచు నుతించి , చాటు ; మే సై పను నాదు భక్తుల విషాదమటంచు ప్రతిజ్ఞ సేయుమా ! ౨౮ |
మిక్కిలి దురాచారముగలవాడైనప్పటికిని అనన్యభక్తిగలవాడై ఇతరమగు దేనియందును భక్తినుంచక ( ఆశ్రయింపక ) , నన్ను భజించునేని , అతడు సత్పురుషుడనియే ( శ్రేష్ఠుడనియే ) తలంపబడదగినవాడు . ఏలయనగా అతడు స్థిరమైన ( ఉత్తమ ) మనోనిశ్చయము గలవాడు . అతడు ( నన్నాశ్రయించిన పాపాత్ముడు ) శీఘ్రముగ ధర్మబుద్ధి గలవాడగుచున్నాడు . మఱియు శాశ్వతమైన శాంతిని పొందుచున్నాడు . ఓ అర్జునా ! ' నా భక్తుడు చెడడు ' అని ప్రతిజ్ఞ చేయుము . |
|
అ. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేऽపి స్యుః పాపయోనయః| స్త్రియో వైశ్యాస్తథా శూద్రా స్తేऽపి యాన్తి పరాం గతిమ్|| 9-32 అ. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా||| |
తేటగీతి. స్త్రీలు వైశ్య శూద్రులు నీచ జీవులయిన నన్న నన్య భక్తినిఁ గొల్వ నన్నుఁ గందు ; రన్నచో , బ్రహ్మవేత్తల నెన్నవలెనె , సద్గతిన్ గూర్చి వేరేల సన్నుతింప ? ౨౯|| |
ఓ అర్జునా ! ఎవరు పాపజన్మము ( నీచజన్మము ) గలవారై యుందురో , వారును , స్త్రీలును , వైశ్యులును , అట్లే శూద్రులును నన్నాశ్రయించి సర్వోత్తమపదవిని ( మోక్షమును ) నిశ్చయముగ పొందుచున్నారు . ఇక పుణ్యాత్ములగు బ్రాహ్మణుల విషయమునను , భక్తులగు రాజర్షుల విషయమునను మఱల చెప్పనేల ? ( భగవదాశ్రయముచే వారున్ను తప్పక ముక్తినొందుదురని భావము ) . |
|
అనిత్యమసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మామ్|| 9-33 |
కందము. క్షణ భంగురమును , దుఃఖద మును నగు సంసారమందు మునుఁగుచుఁ దేలన్ దనువుల నొందగ నేలా ? అనయమ్ము ననున్ భజింప నారట ముడుగున్ . ౩౦ |
కావున అశాశ్వతమై , సుఖరహితమైనట్టి ఈ లోకమును పొందియున్న నీవు నన్ను భజింపుము . |
|
అ. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు| మామేవైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః|| 9-34 |
ఉత్పలమాల. నన్ను మనంబునందు మననం బొనరింపుము , భక్తి యుక్తులన్ నన్నె సతంబు గొల్చి , యజనంబులు సల్పుము , నీ నమస్కృతుల్ నన్నె తలంచి చేయుము , కనంబడు భూతచయమ్ములెల్ల నే నున్న స్వరూపమే యని , మహోద్గతి నేనె యటంచు నెంచుమా ! ౩౧ |
నా యందే మనస్సు కలవాడవును , నాభక్తుడవును , నన్నే పూజించువాడవును అగుము . నన్నే నమస్కరింపుము . ఈ ప్రకారముగ చిత్తము నాయందే నిలిపి నన్నే పరమగతిగ నెన్నుకొన్నవాడవై తుదకు నన్నే పొందగలవు . |
|
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే రాజవిద్యారాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః|| 9 || |
ఓమ్ తత్ సత్ ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీ విశ్వనాథ శాస్త్రిచే అనువదింపఁబడిన శ్రీ గీతామృత తరంగిణి యందు శ్రీ రాజ విద్యా రాజగుహ్య యోగమను నవమ తరంగము సంపూర్ణము. శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. |
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు , యోగశాస్త్రమును , శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు రాజవిద్యా రాజగుహ్యయోగమను తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము. ఓమ్ తత్ సత్. |
Labels:
గీతామకరందము,
శ్రీ గీతామృత తరంగిణి,
శ్రీ మద్భగవద్గీత
Tuesday, October 20, 2009
అక్షర పరబ్రహ్మ యోగము
| శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) | శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు) శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952) | గీతా మకరందము(తెలుగు తాత్పర్యము) శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979) |
|---|---|---|
అర్జున ఉవాచ| అ. కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ| అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే|| 8-1 అనుష్టుప్ అధియజ్ఞః కథం కోऽత్ర దేహేऽస్మిన్మధుసూదన| ప్రయాణకాలే చ కథం జ్ఞేయోऽసి నియతాత్మభిః|| 8-2 | అర్జును వాక్యము. తేటగీతి. మాధవా ! బ్రహ్మ మధ్యాత్మమౌ న దేమి ? కర్మయన నేమి ? యధి భూత మర్మమేమి ? దేహమున నధియజ్ఞ మదేమొ , దేహ పాతమున నిన్నెటులఁ గనువాఁడొ , తెలియఁ బలుకు మధిదైవ మననేమొ , సలలితముగ .౧ | అర్జును డడిగెను. పురుష శ్రేష్ఠుడవగు ఓ కృష్ణా ! ఆ బ్రహ్మ మేది ? అధ్యాత్మ మెయ్యది ? కర్మమనగా నేమి ? అధిభూతమని ఏది చెప్పబడినది ? అధిదైవమని దేనిని చెప్పుదురు ? ఈ దేహమందు అధియజ్ఞు డెవడు ? అతనిని తెలుసుకొనుట ఎట్లు ? ప్రాణప్రయాణ సమయమందు నియమితచిత్తులచే నీ వెట్లు తెలిసికొనబడగలవు ? |
శ్రీభగవానువాచ| అ. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోऽధ్యాత్మముచ్యతే| భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః|| 8-3 | శ్రీ భగవానుల వాక్యము. తేటగీతి. బ్రహ్మ మన నాత్మ యక్షర భావమౌను , జీవభావమ్ము నధ్యాత్మగా వచింత్రు , భూతకోటుల సృష్టికి హేతువైన యల విసర్గయే కర్మ యంచనగఁ బరగు . ౨ | శ్రీ భగవానుడు చెప్పుచున్నాడు. సర్వోత్తమమైన ( నిరతిశయమైన ) నాశరహితమైనదే బ్రహ్మమనబడును . ప్రత్యగాత్మ భావము అధ్యాత్మమని చెప్పబడును . ప్రాణికోట్లకు ఉత్పత్తిని గలుగజేయు ( యజ్ఞాదిరూపమగు ) త్యాగపూర్వకమైన క్రియ కర్మమను పేరు కలిగియున్నది . |
అనుష్టుప్. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్| అధియజ్ఞోऽహమేవాత్ర దేహే దేహభృతాం వర|| 8-4 | తేటగీతి. తెలియు మధిభూతమనఁ బుట్టుకలును , నాశ నమ్ముఁ గల వస్తుతతి యంచు నమ్ముమయ్య ; పురుషుఁడది దైవమని , దేహములను సకల యజ్ఞములఁ బ్రీతినొందు వాఁడగుదు నేను . ౩ | దేహధారులలో శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! నశించు పదార్థము అధిభూత మనబడును. విరాట్పురుషుడు లేక హిరణ్యగర్భుడే అధిదైవతమనబడును . ఈ దేహమందు నేనే ( పరమాత్మయే ) అధియజ్ఞుడనబడును. |
అ. అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరమ్| యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః|| 8-5 | తేటగీతి. మరణ కాలమ్మునన్ గూడ మఱువకుండ నన్ను స్మరియించు నెవ్వాడొ నన్నెఁ జేరు , శాశ్వతానంద సుస్థిర స్వాంత మంది ; సందియము లేదు , నిక్కమ్ము సవ్యసాచి ! ౪ | ఎవడు మరణకాలమందుకూడ నన్నే స్మరించుచు శరీరమును విడిచిపోవుచున్నాడో , అతడు నాస్వరూపమును పొందుచున్నాడు . ఇట సంశయమేమియును లేదు . |
అ. యం యం వాపి స్మరన్భావం త్యజత్యన్తే కలేవరమ్| తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః|| 8-6 | మత్తేభము. తను వున్నప్పుడుఁ , బోవునప్పుడెటులన్ ధ్యానించు భావంబు నం దనువౌ జన్మలఁ గాంచుచుందు రెపుడున్ స్వాంతమ్ములన్ గామ్యముల్ గనునందాక , పునః పునాగమముగా కర్మాను బంధమ్ములై , వెనువెంటన్ జను నీచయోనుల గతిన్ వెన్నాడుచున్ ఫల్గునా ! ౫ | అర్జునా ! ఎవడు మరణకాలమున ఏయే భావమును ( లేక రూపమును ) చింతించుచు దేహము వీడునో వాడట్టి భావముయొక్క స్మరణచే గలిగిన సంస్కారము గలిగియుండుట వలన ఆ యా రూపమునే పొందుచున్నాడు . |
అ. తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ| మయ్యర్పితమనోబుద్ధి ర్మామేవైష్యస్యసంశయః|| 8-7 | తేటగీతి. పార్థ ! నీ మనోబుద్ధు లర్పణముఁ జేసి , సర్వ కాలమ్ములన్ నన్నె సంస్మరించి , ధర్మ యుద్ధమ్ముఁ జేయు , మాదటను వాసు దేవున నె పొందెదవు , సందియము లేదు. ౬ | కాబట్టి ఎల్లకాలములందును నన్ను స్మరించుచు ( నీ స్వధర్మమగు ) యుద్ధమునుగూడ చేయుము . ఈ ప్రకారముగ నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడవైనచో నీవు నన్నే పొందగలవు . ఇట సంశయము లేదు . |
అ. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా| పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్|| 8-8 | తేటగీతి. ఇతర విషయమ్ములకు మనం బేగకుండ , ధ్యాననిష్ఠా గరిష్ఠుఁడౌ మౌనివరుఁడు , పరమ పురుషు పరంజ్యోతి నిరుపమాన మైన జ్ఞాన సంపూర్ణుఁడౌ వాని గనును . ౭ | ఓ అర్జునా ! అభ్యాసమను యోగముతో గూడినదియు , ఇతర విషయములపైకి పోనిదియునగు మనస్సుచేత , అప్రాకృతుడైన ( లేక స్వయంప్రకాశ స్వరూపుడైన ) సర్వోత్తముడగు పరమపురుషుని మరల మరల స్మరించుచు మనుజుడు అతనినే పొందుచున్నాడు . |
ఉపజాతి. కవిం పురాణమనుశాసితార- మణోరణీయంసమనుస్మరేద్యః| సర్వస్య ధాతారమచిన్త్యరూప- మాదిత్యవర్ణం తమసః పరస్తాత్|| 8-9 ఉపజాతి. ప్రయాణకాలే మనసాऽచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ| భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యమ్|| 8-10 | ఉత్పలమాల. నన్ను జగన్నియంతను , సనాతను , సత్కవి , నింద్రియాళికిన్ గన్నులకున్ మనంబునకుఁ గానగరాని యచింత్యరూపునిన్ , సన్నుత సర్వదాతను , నిశాపర దివ్య రవి ఫ్రభాసు , భ క్తి న్ని రతాశ్రయుండయి , గతించిన యప్డు స్మరింపనయ్యెడున్. ౮ తేటగీతి. మరణ కాలమ్మునందు సమాధి యోగ యుక్తుఁడై , భక్తి ప్రాణవాయువుల నెల్ల భ్రూసమమ్మున నిలిపి , సంపూర్ణమనము నం దలంచెడువాఁడు , నన్నొందు , నిజము . ౯ | ఎవడు భక్తితో గూడుకొనినవాడై అంత్యకాలమునందు యోగబలముచే ( ధ్యానాభ్యాస సంస్కారబలముచే ) ప్రాణవాయువును భ్రూమధ్యమున ( కనుబొమ్మలనడుమ ) బాగుగ నిలిపి , ఆ పిదప సర్వజ్ఞుడును , పురాణపురుషుడును , జగన్నియామకుడును , అణువుకంటెను మిగుల సూక్ష్మమైనవాడును , సకలప్రపంచమునకు ఆధారభూతుడును ( సంరక్షకుడును ) , చింతింప నలవికాని స్వరూపము గలవాడును , సూర్యుని కాంతి వంటి కాంతిగలవాడును ( స్వయంప్రకాశ స్వరూపుడును ) , అజ్ఞానాంధకారమునకు ఆవలనుండువాడు నగు పరమాత్మను నిశ్చలమనస్సుచే ఎడతెగక చింతించునో అతడు దివ్యరూపుడైన సర్వోత్తముడగు ఆ పరమాత్మనే పొందుచున్నాడు ., |
ఉపజాతి. యదక్షరం వేదవిదో వదన్తి విశన్తి యద్యతయో వీతరాగాః| యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే|| 8-11 | తేటగీతి. వేదవిదు లక్షరంబని వినుతిఁ జేయు దురు , జితేంద్రియు లెద్ది పొందుదురు , బ్రహ్మ చారు లెదియొంద జతనమ్ము సలుపుచుందు , రా పథంబునుఁ దెలిపెద , నాలకింపు . ౧౦ | వేదవేత్తలు దేనిని నాశరహితమైనదానినిగ జెప్పుచున్నారో , రాగరహితుడగు ( కోరికలు నశించిన ) యత్మశీలురు ( జితేంద్రియులు ) ఎద్దానియందు ప్రవేశించుచున్నారో , దేనిని అభిలషించుచు జనులు బ్రహ్మచర్యము ననుష్ఠించుచున్నరో , అట్టి ( పరమాత్మ ) పదమునుగూర్చి నీకు సంక్షేపముగ జెప్పెదను . |
అ. సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ| మూధ్న్యా|ర్ధాయాత్మనః ప్రాణ మాస్థితో యోగధారణామ్|| 8-12 అ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్| యః ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్|| 8-13|| | కందము. విజితేంద్రియుఁడై హృదయాం బుజమందునె మనసు నిలిపి , మూర్ధమునందున్ నిజప్రాణానిలమును న క్కజముగ బంధించి , యోగగతికిఁ జరించున్. ౧౧ కందము. ఓ మిత్యే కాక్షరమును నీమమున ననున్ స్మరించి , నిర్గమ మొందన్ , మామకమౌ సుస్థిరమగు ధామమ్మునుఁ జేరునతఁడు , తథ్యము పార్థా ! ౧౨ | ఎవడు ఇంద్రియద్వారము లన్నిటిని బాగుగ అరికట్టి , మనస్సును హృదయమందు ( ఆత్మయందు ) లెస్సగా స్థాపించి , శిరస్సునందు ( బ్రహ్మరంధ్రమందు ) ప్రాణవాయువును ఉంచి , ఆత్మనుగూర్చిన ఏకాగ్రచింతనము ( యోగధారణ ) గలవాడై పరబ్రహ్మమునకు వాచకమైన ' ఓమ్ ' అను అక్షరమును ఉచ్ఛరించుచు నన్ను ఎడతెగక చింతించుచు శరీరమును వదలునో అతడు సర్వోత్తమస్థానమును ( మోక్షమును ) బొందుచున్నాడు . |
అ. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః| తస్యాహం సులభః పార్థ ! నిత్యయుక్తస్య యోగినః|| 8-14 | కందము. ఏకాగ్ర చిత్తగతుఁడై యే కాలమునందు నన్ స్మరింపుచునుండున్ , ఏకైక నిరత భక్తున కే , కైవస మొందుచుందు , నిటు సులభుఁడనై. ౧౩ | ఓ అర్జునా ! ఎవడు అనన్యచిత్తుడై నన్నుగూర్చి ప్రతిదినము నిరంతరము స్మరించుచుండునో అట్టి నిరంతరధ్యానపరులకు నేను సులభముగ పొందబడువాడనై యున్నాను. |
అ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్| నాప్నువన్తి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః|| 8-15 | తేటగీతి. నను భజించుచు , నా పథమ్మును గమించు నా మహాత్ములు దుఃఖమెందైనఁ గనరు ; చావు పుట్టుక నొందు సంసార వార్ధి నుత్తరింతురు , తిరిగి రాకుందు రెపుడు . ౧౪ | సర్వోత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందినవారై మరల - దుఃఖనిలయమై అనిత్యమైనట్టి - జన్మను ఎన్నటికిని పొందనేరరు . |
అ. ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున| మాముపేత్య తు కౌన్తేయ ! పునర్జన్మ న విద్యతే|| 8-16 | తేటగీతి. బ్రహ్మలోకమ్ము మొదలు స్వర్గమ్ము వరకు సకలముల్ పుట్టి మఱల నాశమ్ములగును ; దివ్యమౌ నా పథంబు నొందిన నరుండు , తిరిగి పుట్టుకఁ జావులఁ దెలియఁ బోడు . ౧౫ | ఓ అర్జునా ! బ్రహ్మలోకమువఱకుగల లోకములన్నియు తిరిగివచ్చెడి స్వభావము కలవి ( అనగా వానిని పొందినవారు మరల జన్మ మెత్తవలసియే వచ్చుదురు ) . నన్ను పొందినవారికో మరల జన్మయే లేదు . |
అ. సహస్రయుగపర్యన్త మహర్యద్ బ్రహ్మణో విదుః| రాత్రిం యుగసహస్రాన్తాం తేऽహోరాత్రవిదో జనాః|| 8-17 | తేటగీతి. వేయి యుగములు పగలును , రేయియటులె వేయి యుగములు ; బ్రహ్మకు రేయి , పగలు ; పగట ప్రభవించి , రాత్రి యా ప్రకృతి యడగుఁ జర్వితము సృష్టి యిట్టుల సంచరించు . ౧౬ | ఏ జనులు బ్రహ్మదేవునియొక్క పగటిని వేయి యగముల పరిమితిగలదానిగను , అట్లే రాత్రిని వేయియుగముల పరిమితిగలదానిగను ఎఱుగుదురో , అట్టివారు రాత్రింబగళ్ళయొక్క తత్త్వమును బాగుగ నెఱింగిన వారగుదురు . |
అ. అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః ప్రభవన్త్యహరాగమే| రాత్ర్యాగమే ప్రలీయన్తే తత్రైవావ్యక్తసంజ్ఞకే|| 8-18 అ. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే| రాత్ర్యాగమేऽవశః పార్థ ! ప్రభవత్యహరాగమే|| 8-19 | తేటగీతి. పూర్వకల్పమ్ము నందున్న భూతచయము బ్రహ్మదేవు సుషుప్తి కాలమ్మునందు లయము నొందుచు , మఱలను ప్రభవమొందు బ్రహ్మదేవు ప్రబోధ కాలమ్మునందు . ౧౭ | బ్రహ్మ దేవుని పగలు ప్రారంభమగునపుడు అవ్యక్తము ( ప్రకృతి ) నుండి సమస్త చరాచరవస్తువులు పుట్టుచున్నవి . మరల రాత్రి ప్రారంభమగునపుడు ఆ అవ్యక్తమునందే లీనమగుచున్నవి. ఓ అర్జునా ! ఆ యీ ( పూర్వకల్ప మందలి ) ప్రాణి సమూహమే కర్మపరాధీనమై పుట్టిపుట్టి ( బ్రహ్మదేవుని ) రాత్రియొక్క ప్రారంభమున ( మరల ) విలయమొందుచున్నది . తిరిగి ( బ్రహ్మదేవుని ) పగటియొక్క ప్రారంభమున పుట్టుచున్నది . |
అ.పరస్తస్మాత్తు భావోऽన్యోऽ వ్యక్తోऽవ్యక్తాత్సనాతనః| యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి|| 8-20 అ. అవ్యక్తోऽక్షర ఇత్యుక్త స్తమాహుః పరమాం గతిమ్| యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ|| 8-21 అ. పురుషః స పరః పార్థ ! భక్త్యా లభ్యస్త్వనన్యయా| యస్యాన్తఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్|| 8-22|| | చంపకమాల. ఎది సతతమ్మున న్నిలుచు , నెయ్యది యేప్రళయంబు లందునన్ అదియె సనాతనమ్మయిన యవ్యయ భావ మటంచెఱుంగుమా ! సదమల మక్షరంబగుచు , శాశ్వతమైన , మదీయ ధామ మ య్యది , లభియింప రారు , తిరుగాడగఁ బుట్టుక చావు లందగన్ . ౧౮ సీ. ఎవ్వాని సంకల్పమే జగంబులకెల్ల , ప్రభవ కారణమౌచుఁ బరగుచుండు ; నెవ్వాని కనుచూపు నెల్ల లోకములఁ గ ల్యాణమై , సంపద లలము కొనును ; యెవ్వాడు కనుమూసి పవ్వళించిన తోడ , ప్రళయంబులై జగంబులు నశించు ; నెవ్వాని క్రీడకై యీ రేడు జగములు , పూచెండుల విధానఁ దోచుచుండు ; ఆటవెలది. నా మహాత్మునిఁ గన నలవికా దెవ్వరి ; కితర సాధనముల నెన్నియైనఁ , ద్రికరణముల నెపుడు , స్థిరమైన యేకాంత భక్తివలనె , పట్టు వడును , పార్థ ! ౧౯ | ఏ పరమాత్మ వస్తువు ఆ అవ్యక్తము ( ప్రకృతి ) కంటె వేరైనదియు , ఉత్తమమైనదియు , ఇంద్రియములకు వ్యక్తము కానిదియు , పురాతనమైనదియునగునో , అయ్యది సమస్త ప్రాణికోట్లు నశించినను నశించకయే యుండును . ఏ పరమాత్మ ( ఇంద్రియములకు ) అగోచరుడనియు , నాశరహితుడనియు చెప్పబడెనో , అతనినే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగా వేదవేత్తలు చెప్పుచున్నారు . దేనిని పొందినచో మరల ( వెనుకకు తిరిగి ఈ సంసారమున ) జన్మింపరో , అదియే నాయొక్క శ్రేష్ఠమైన స్థానము ( స్వరూపము ) అయియున్నది . ఓ అర్జునా ! ఎవనియం దీప్రాణికోట్లన్నియు నివసించుచున్నవో , ఎవనిచే ఈ సమస్త జగత్తున్ను వ్యాపింపబడియున్నదో , అట్టి పరమపురుషుడు ( పరమాత్మ ) అనన్యమగు ( అచంచలమగు ) భక్తి చేతనే పొందబడగలడు . |
అ. యత్ర కాలే త్వనావృత్తి మావృత్తిం చైవ యోగినః| ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ|| 8-23 | ఆటవెలది. మరణించు పిదప నెవ రే స్థిర చరమగు లోకములనుఁ జేరి కొనెదరో , యెఱిగింతు ధనంజయ ! విను పరమ రహస్యమ్ము కాలపరిమితి నెల్లన్ . ౨0 | భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఏ కాలమందు ( లేక , ఏ మార్గమందు ) ( శరీరమును విడిచి ) వెడలిన యోగులు మరల తిరిగిరారో ( జన్మము నొందరో ) , ఏ కాలమందు వెడలిన యోగులు మరల తిరిగి వచ్చుదురో ( జన్మించుదురో ) , ఆ యా కాల విశేషములను చెప్పుచున్నాను . |
అ. అగ్నిర్జోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్| తత్ర ప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః|| 8-24 | తేటగీతి. ఆరుమాసమ్ము లౌ నుత్త రాయణమ్ము , శుక్ల పక్ష మగ్నిర్జ్యోతి చొప్పుగనుచు , మరణ మొందిన జ్ఞానులు తిరిగిరారు , బ్రహ్మ కల్పాంతమున బ్రహ్మ భావమంది . ౨౧ | అగ్ని , ప్రకాశము , పగలు , శుక్లపక్షము , ఆఱు నెలలుగల ఉత్తరాయణము , ఏ మార్గమందుగలవో , ఆ మార్గమున వెడలిన బ్రహ్మవేత్తలగు జనులు బ్రహ్మమునే పొందుచున్నారు . |
అ. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్| తత్ర చాన్ద్రమసం జ్యోతి ర్యోగీ ప్రాప్య నివర్తతే|| 8-25 | తేటగీతి. ఆరు మాసమ్ము లౌ దక్షిణాయనమ్ము కృష్ణ పక్షమ్ము ; ధూమ రాత్రిని గతించు యోగివర్యులు , చంద్రలోకోన్నతిఁ గని తిరిగి వత్తురు , పుణ్యమ్ము తరుగఁ గానె . ౨౨ | పొగ , రాత్రి , కృష్ణపక్షము , ఆఱునెలలుగల ధక్షిణాయనము ఏ మార్గమునగలవో ఆ మార్గమున ( వెడలిన ) సకామకర్మయోగి చంద్రసంబంధమైన ప్రకాశమునుబొంది మఱల వెనుకకు వచ్చుచున్నాడు ( తిరిగి జన్మించుచున్నాడు ) . |
అ. శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే| ఏకయా యాత్యనావృత్తి మన్యయావర్తతే పునః|| 8-26 అ. నైతే సృతీ పార్థ జాన న్యోగీ ముహ్యతి కశ్చన| తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున|| 8-27 | ఉత్పలమాల. దారులు రెండిటిన్ దెలియు ధన్యులు మోహము నందకుండ , సం సార పరీత దుఃఖపు సానువులన్ జరియింపఁ బోవ , రా ధీరులు జ్ఞానభాస్కర సదృక్తపనీయులు గాన , పార్థ ! యా తీరునె , నీవు యోగ నిరతిం గనుచుండుము , సర్వకాలమున్ . ౨౩ | ఈ శుక్ల కృష్ణమార్గములు రెండును జగత్తునందు శాశ్వతముగ నుండునవిగ తలంపబడుచున్నవి . అందు మొదటిదానిచే జన్మరాహిత్యమును , రెండవ దానిచే మరల జన్మమును యోగి పొందుచున్నాడు . ఓ అర్జునా ! ఈ రెండుమార్గములను ఎఱుఁగునట్టియోగి యెవడును ఇక మోహమును బొందడు . కాబట్టి నీ వెల్లకాలమందును ( దైవ ) యోగయుక్తుడవు కమ్ము . |
ఇంద్రవజ్ర. వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్| అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యమ్|| 8-28 | ఉత్పలమాల. వేదములన్ పఠించిన , వివేకము యజ్ఞతపంబులంది , సం పాదితమైన సత్ఫలముఁ , బావన తీర్థములందు దాన ధ ర్మాది ప్రపూత కర్మల ఫలంబుల పుణ్యమతిక్రమించి , య య్యాది కవీంద్రు బ్రహ్మ పథమందెడు యోగివరుండు , ఫల్గునా ! ౨౪ | యోగియైనవాడు దీనిని ( ఈ అధ్యాయమున చెప్పబడిన అక్షరపరబ్రహ్మతత్త్వము మున్నగువానిని ) ఎఱిఁగి వేదములందును , యజ్ఞములందును , దానములందును , తపస్సులందును ఏపుణ్యఫలము చెప్పబడియున్నదో , దానినంతను అతిక్రమించుచున్నాడు . ( దానిని మించిన పుణ్యఫలమును పొందుచున్నాడు ) . మఱియు అనాదియగు సర్వోత్తమ ( బ్రహ్మ ) స్థానమును బొందుచున్నాడు . |
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే అక్షరబ్రహ్మయోగో నామాష్టమోऽధ్యాయః|| 8 || | ఓం తత్ సత్ శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిచే యనువదింపబడిన శ్రీ గీతామృత తరంగిణి యందలి శ్రీ అక్షర పరబ్రహ్మ యోగము అను అష్టమ తరంగము సంపూర్ణం . శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. | ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు , యోగ శాస్త్రమును , శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు అక్షర పరబ్రహ్మ యోగమను ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము . ఓమ్ తత్ సత్. |
Monday, October 19, 2009
జ్ఞానవిజ్ఞాన యోగము
| శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) | శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు) శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952) | గీతా మకరందము(తెలుగు తాత్పర్యము) శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979) |
|---|---|---|
శ్రీభగవానువాచ| అ. మయ్యాసక్తమనాః పార్థ ! యోగం యుఞ్జన్మదాశ్రయః| అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు|| 7-1 | శ్రీభగవానుల వాక్యము. ఉత్పలమాల. నన్ను సతంబు నీ మనమునన్ భజియించెడు నీకు , సందియం బెన్నఁగ లేని చందము , మదీయ విభూతి మహత్త్వ సత్త్వ సం పన్న బలోద్ధితమ్ముల ప్రభావము , నిండు మనంబుతో వినన్ , నన్ను సమగ్రమున్ దెలియు నట్టులఁ జెప్పెద , నాలకింపవే. ౧ | శ్రీ భగవంతుడు చెప్పెను. ఓ అర్జునా ! నాయందాసక్తి గల మనస్సు గలిగి నన్నే ఆశ్రయించి యోగము నాచరించుచు నిస్సందేహముగ సంపూర్ణముగ నన్నెట్లు తెలిసికొనగలవో దానిని ( ఆ పద్ధతిని ) చెప్పెదను వినుము. |
అనుష్టుప్. జ్ఞానం తేऽహం సవిజ్ఞాన మిదం వక్ష్యామ్యశేషతః| యజ్జ్ఞాత్వా నేహ భూయోऽన్యద్ జ్జ్ఞాతవ్యమవశిష్యతే|| 7-2 | కందము. ఇది తెలియ , నిహము నందిక నెది తెలియఁగఁ దగిన జ్ఞాన మేదియుఁ గనరా ; దిది , స్వానుభవ జ్ఞానము విదిత మ్మొనరింతుఁ బార్థ ! విజ్ఞానంబున్. ౨ | దేనిని తెలిసికొనినచో మరల యీ ప్రపంచమున తెలిసికొనదగినది మరియొకటి మిగిలియుండదో అట్టి అనుభవసహితమగు జ్ఞానమును సంపూర్ణముగ నీకు జెప్పెదను. |
అనుష్టుప్. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే| యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః|| 7-3 | ఉత్పలమాల. వేనకు వేల నొక్కఁడు గవేషణసేయఁ బ్రయత్న మూను ; వి జ్ఞానము నొందువారల నొకండగు వేల సమగ్రమైన సు జ్ఞానమునన్ ననున్ దెలియు , సాంద్రమనంబున సత్త్వశుద్ధి సం ధానముఁ జేసి ; వాఁడె , కడుధన్యుఁడగున్ జగమందు నందఱన్. ౩ | అనేకవేలమంది మనుజులలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించువారైన అనేకమందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవముగ తెలిసికొనగల్గుచున్నాడు. |
అ. భూమిరాపోऽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ| అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా|| 7-4 | తేటగీతి. పంచభూత మాత్రమ్ము లంచితముగ , మనసు , బుద్ధి , యహంకార మను నెనిమిది ; ప్రకృతి విధములు నామాయ పాండవేయ ! బంధహేతు లివియె , ప్రపంచ మందు ౪ | భూమి , జలము , అగ్ని , వాయువు , ఆకాశము , మనస్సు , బుద్ధి , అహంకారము - అని ఈ ప్రకారముగ ఎనిమిది విధములుగ నా యీ ప్రకృతి ( మాయ ) విభజింపబడినది. |
అ. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్| జీవభూతాం మహాబాహో ! యయేదం ధార్యతే జగత్|| 7-5 | కందము. ఇవి గాక జీవభూతం బవు పరమోత్కృష్టమైన ప్రకృతిఁ దెలియుమా ! భువనము లెల్ల ధరించుచు , నవగతమై భూతచయములందుఁ జరించున్ . ౫ | గొప్పబాహువులుగల ఓ అర్జునా ! ఈ ( అపరా ) ప్రకృతి చాల అల్పమైనది . దీనికంటె వేఱైనదియు , ఈజగత్తునంతను ధరించునదియు , జీవరూపమైనదియు నగు మఱియొక ప్రకృతిని ( పరాప్రకృతిని ) శ్రేష్ఠమైనదిగా నెఱుంగుము . |
అ. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ| అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా|| 7-6 | తేటగీతి. ఈ పరాపర ప్రకృతులే యెల్ల భూత తతి సముద్భవ కారణాంతములగును ; నా యధీనములివి , జగన్నాథుఁడ నయి , ప్రభవ లయముల కారణ ప్రదుఁడ నౌదు. ౬ | ( జడ , చేతనములగు ) సమస్త భూతములున్ను యీ రెండు విధములగు ( పరాపర ) ప్రకృతుల వలననే కలుగునవియని తెలిసికొనుము. ( ఆ రెండు ప్రకృతుల ద్వారా ) నేనే ఈ సమస్త ప్రపంచము యొక్క ఉత్పత్తికి , వినాశమునకు కారణభూతుడనై యున్నాను. |
అ. మత్తః పరతరం నాన్య త్కిఞ్చిదస్తి ధనఞ్జయ| మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ|| 7-7 | కందము. నా కంటె జగంబుల నిక నే కారణమున్ గనంగ నెఱుఁగవు , పార్థా ! సాకల్యము మణిగణములఁ జే కూర్చెడు సూత్రమౌచు , సృష్ఠి ధరింతున్. ౭ | ఓ అర్జునా ! నాకంటె వేఱుగ మఱియొకటి ఏదియు లేనే లేదు . దారమందు మణులవలె నాయందీ సమస్త ప్రపంచము కూర్చబడినది. |
అ. రసోऽహమప్సు కౌన్తేయ ! ప్రభాస్మి శశిసూర్యయోః| ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు|| 7-8 | తేటగీతి. ఉదకములయందు రసమేనె ; వ్యోమమందు శబ్దమును ; శశి సూర్య భాసములు నేనె ; వేదములయందు ప్రణవమ్మున్ , నీరవరుల పౌరుషమ్మును నేనౌదు పార్థ ! నిజము. ౮ | అర్జునా ! నేను జలమందు రుచియు , చంద్రసూర్యులందు కాంతియు , సమస్తవేదములందు ఓంకారమును , ఆకాశమందు శబ్దమును , మనుజులందు పరాక్రమమును అయియున్నాను. |
అ. పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ| జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు|| 7-9 | తేటగీతి. ధర గుబాళించు దివ్య గంధమ్ము నేనె ; యనలమునుఁ గూర్చు తేజమ్ము నౌదు నేనె ; సర్వజీవస్థితిన్ గూర్చు సత్త్వ మేనె ; తాపసుల యందుఁ దపమునై తనరు దేనె. ౯ | ( మఱియు నేను ) భూమియందు సుగంధమును , అగ్నియందు ప్రకాశమును , సమస్తప్రాణులయందు ప్రాణమును ( లేక ఆయువును ) , తాపసులయందు తపస్సును అయియున్నాను. |
అ. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్| బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్|| 7-10 | తేటగీతి. సర్వ భూతమ్ములకును బీజమ్ము నేనె ; బుద్ధిమంతుల బుద్ధి , సంపూర్ణమేనె ; కడు సమర్థుల యందు ప్రాగల్భ్య మేనె ; బలయుతులయందు సద్బలంబ నగు దేనె. ౧౦ | ఓ అర్జునా ! నన్ను సమస్త ప్రాణులయొక్క శాశ్వతమైన బీజముగ నెఱుంగుము . మఱియు , బుద్ధిమంతులయొక్క బుద్ధియు , ధీరులయొక్క ధైర్యమును నేనే అయియున్నాను . |
అ. బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్| ధర్మావిరుద్ధో భూతేషు కామోऽస్మి భరతర్షభ|| 7-11 | తేటగీతి. ధర్మ బద్ధమ్ములైన విధాన మొంది , జీవకోటుల మనమందుఁ జెలగుచున్న , యిచ్ఛలెల్లను నేనె యంచెఱుగు మయ్య , భూత తతి యెల్ల సద్వృద్ధిఁ బొందుటకును. ౧౧ | భరతకులశ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! నేను బలవంతునియొక్క ఆశ, అనురాగము లేని బలమును , ప్రాణులయందు ధర్మమునకు వ్యతిరేకముకాని కోరికయు అయియున్నాను. |
అ. యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే| మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి|| 7-12 | తేటగీతి. సత్త్వము , రజంబు , తమముల సంచితమగు భావములు పుట్టుచుండు నా వలనె , పార్ఝ ! ఆశ్రయం బొందు నన్ను నే నాశ్రయింప వాని , మచ్చోదితంబు లే గాని పార్థ ! ౧౨ | సత్త్వరజస్తమోగుణములచే గలిగిన పదార్థములు ( లేక స్వభావములు ) ఎవ్వి కలవో అవి నా వలననే కలిగినవని నీ వెఱుంగుము. అయితే నేను వానియందు లేను . అవి నాయందున్నవి . ( నేను వానికి వశుడనుగాను , అవి నాకు వశవర్తులై యున్నవని భావము ). |
అ. త్రిభిర్గుణమయైర్భావై రేభిః సర్వమిదం జగత్| మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్|| 7-13 | చంపకమాల. త్రివిధగుణైక భావసమితింగొని , యుద్భవమైన యీ జగం బవశతనొందు మోహమున ; నవ్యయమైన విభిన్న లక్షణం బెవఁడు మదీయ సత్త్వ మదియేయని సుంత దలంపఁబోడు, ర జ్జువుఁగని సర్పమంచనెడి చొప్పున నెల్లెడలన్ భ్రమించుచున్. ౧౩ | ఈ చెప్పబడిన మూడు విధములగు సత్త్వరజస్తమోగుణములయొక్క వికారములగు స్వభావములచేత ఈ ప్రపంచమంతయు మోహమును ( అవివేకమును ) బొందింపబడినదై , ఆ గుణముకంటె వేఱై ( అతీతుడనై ) నాశరహితుడనైనట్టి నన్ను తెలిసికొనజాలకున్నది . |
అ. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా| మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే|| 7-14 | కందము. మామకమౌ నీ మాయను నే మనుజుఁడు దాట లే డి కే గతినై నన్ ; ధీమంతుఁ డగుచు నన్నే స్తోమమ్మునఁ గాంచు వాఁడె తొలగునుమాయన్. ౧౪ | ఏలయనగా , దైవసంబంధమైనదియు ( అలౌకిక సామర్థ్యముకలదియు ) , త్రిగుణాత్మకమైనదియునగు ఈ నాయొక్క మాయ ( ప్రకృతి ) దాటుటకు కష్టసాధ్యమైనది . ( అయినను ) ఎవరు నన్నే శరణుబొందుచున్నారో వారీమాయను దాటివేయగలరు . |
అ. న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః| మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః|| 7-15 | తేటగీతి. నీచ కృత్యమ్ములే సదా యాచరించి , యసుర భావమ్మునందు నరాధముండు , నన్ను గననేఱఁ డెన్ని జన్మములనైన , నపహృత జ్ఞాని యగుచు మాయను మునుంగు. ౧౫ | పాపము చేయువారును , మూఢులును , మాయచే అపహరింపబడిన జ్ఞానము గలవారును , రాక్షస స్వభావమును ( అసుర గుణములను ) ఆశ్రయించువారునగు మనుజాధములు నన్ను బొందుటలేదు ( ఆశ్రయించుట లేదు ) . |
అ. చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోऽర్జున ! | ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ|| 7-16 | తేటగీతి. నలు విధంబుల భక్తులు నను భజింత్రు సుకృతములుఁ జేసి , యార్తిని సృక్కువార , లర్థి జనులు , జిజ్ఞాసుల య్యతి మునీంద్రు ; లందుఁ బ్రియతముండగు నాకు నయ్యతివరుండె. ౧౬ | భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఆపత్తునందున్నవాడు , ( భగవంతుని ) తెలిసికొనగోరువాడు , ధనము ( సంపత్తు ) నభిలషించువాడు , ( ఆత్మ ) జ్ఞానముకలవాడు , అను నీ నాలుగువిధములైన పుణ్యాత్ములగు జనులు నన్ను సేవించుచున్నారు ( భజించుచున్నారు ) . |
అ. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే| ప్రియో హి జ్ఞానినోऽత్యర్థ మహం స చ మమ ప్రియః|| 7-17 | తేటగీతి. జ్ఞానికి న్నాకు భేద మే మేని లేదు , స్వీయ రూపమ్మునందు నన్నే యెఱింగి , నన్నె భజియించి , నా పొందె యున్నతి గతి యని తలంచును ; భక్తులం దధికుఁ డతఁడు. ౧౭ | వారి ( నలుగురి ) లో నిత్యము పరమాత్మతో గూడియుండు వాడును , ఒక్క పరమాత్మయందే భక్తి గలవాడునగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు . అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైనవాడను ; అతడున్ను నాకు మిగుల ఇష్టుడే . |
అ. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్| ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్|| 7-18 అ. బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే| వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః|| 7-19 | చంపకమాల. తనువులనేక మెత్తి , సుకృతంబు లొనర్చి , క్రమక్రమంబుగాఁ గనెడు వివేకమున్ బడసి , జ్ఞాని యగున్ ; నను వాసుదేవుగాఁ గనుచు సమస్త మే నె యని గాంచుఁ జరాచరమౌ జగంబు నె ల్లను గడుధన్యుఁ డాతఁడె తలంప , మహాత్ముఁడు దుర్లభుండె యౌ. ౧౮ | వీరందఱున్ను ( పైన దెలిపిన నలుగురు భక్తులు ) మంచివారే . కాని అందు జ్ఞానియో సాక్షాత్ నేనేయని నా అభిప్రాయము . ఏలయనగా అతడు నాయందే చిత్తమును స్థిరముగ నెలకొల్పి నన్నే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగ నిశ్చయించి ఆశ్రయించుకొనియున్నాడు .అనేక జన్మలయొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే ( భగవంతుడే ) యను సద్బుద్ధిగల్గి నన్ను పొందుచున్నాడు - అట్టి మహాత్ముడు లోకములో చాల అరుదు . |
అ. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యన్తేऽన్యదేవతాః| తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా|| 7-20 | తేటగీతి. అనుగతంబైన పూర్వవాసనల బలిమిఁ గాంచి , కామితంబుల నొందగా వ్రతంబు లన్య దేవతారాధన మాచరింతు , రపహృత జ్ఞానులై కొంద ఱల్పమతులు. ౧౯ | ( కొందఱు ) తమయొక్క ప్రకృతి ( జన్మాంతరసంస్కారము ) చే ప్రేరేపింపబడినవారై విషయాదులందలి కోరికలచే వివేకమును గోల్పోయి , దేవతారాధనాసంబంధమైన ఆ యా నియమముల నవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు . |
అ. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి| తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్|| 7-21 | ఉత్పలమాల. ఎట్టి స్వరూప దేవతల నెవ్విధిఁ గొల్తురొ , యట్టి శ్రద్ధ తో బుట్టుక లిత్తు ; నెట్టి తనువు ల్గన నెంచి భజింతు రట్లుఁ జే పట్టిన దేవతాళిడు నెపంబున ; మామకమైన మాయ లో గుట్టు నెఱుంగుమా ! ప్రకృతి కోటి గణంబులు దేవతల్ జుమా ! ౨౦ | ఏయే భక్తుడు ఏయే ( దేవతా ) రూపమును శ్రద్ధతో పూజింపదలంచుచున్నాడో , దానిదానికి తగిన శ్రద్ధనే వానివానికి నేను స్థిరముగ గలుగ జేయుచున్నాను . |
అ. స తయా శ్రద్ధయా యుక్త స్తస్యారాధనమీహతే| లభతే చ తతః కామా న్మయైవ విహితాన్హి తాన్|| 7-22 అ. అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్| దేవాన్దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి|| 7-23 అ. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయః| పరం భావమజానన్తో మమావ్యయమనుత్తమమ్|| 7-24 | చంపకమాల. క్షణికములౌ ఫలంబులకుఁ గాంక్షవహించి , నికృష్ట దేవతల్ దనువుల నాశ్రయింతురు ; తలంపరు అవ్యయుఁ డంచు నన్ను , నీ కనులకు వ్యక్తి రూపమునఁ గాంచఁ దలంతురు బుద్ధి హీనతన్ ; ననుఁగన నేర రింద్రియ మనంబుల ; జ్ఞానుల కే లభించెదన్. ౨౧ | అతడు ( పైన తెలుపబడిన కామ్యభక్తుడు ) అట్టి శ్రద్ధతోగూడుకొనినవాడై ఆ యా దేవతలయొక్క ఆరాధనను గావించుచున్నాడు . మఱియు నాచే విధింపబడిన ఆ యా యిష్టఫలములను ఆ యా దేవతలద్వారా పొందుచున్నాడు . అల్పబుద్ధి కలిగినవారియొక్క ఆ ఫలము నాశవంతమై యున్నది . ( ఏలయనగా ) దేవతలను పూజించువారు దేవతలనే పొందుచున్నారు . నా భక్తులు ( నన్ను పూజించువారు ) నన్నే పొందుచున్నారు . నాశరహితమైనట్టియు , సర్వోత్తమమైనట్టియు , నా స్వరూపమును తెలియని అవివేకులు అవ్యక్తరూపుడనగు ( ప్రపంచాతీతుడనగు ) నన్ను పాంచభౌతికదేహమును పొందినవానినిగా తలంచుచున్నారు . |
అ. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః| మూఢోऽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్|| 7-25 | తేటగీతి. యోగ మాయావృతుండనై యోగివరుల కే లభించెదఁ గాని నేనించు కైన ప్రాణి కోటులకున్ గాన రాను , పార్థ ! అవ్యయుండ నజుండ నంచఱయ లేరు. ౨౨ | యోగమాయచే బాగుగా కప్పబడియుండుటచే నేను అందఱికిని కనుపించువాడనుగాను .అవివేకులగు ఈ జనులు నన్ను పుట్టుకలేనివానినిగను , నాశరహితునిగను ఎఱుఁగరు ! |
అ. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున| భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన|| 7-26 | తేటగీతి. భూతవర్త మాన భవితముల ప్రపత్తి నెల్ల నెఱిగిన నన్నొక , యించు కైనఁ దెలియఁ జాలక నున్నారు , తెలివి మాలి మోహ కలనమ్మునను , మానవులు కిరీటి ! ౨౩ | ఓ అర్జునా ! నేను భూతభవిష్యద్వర్తమానమందలి ప్రాణులందఱిని ఎఱుఁగుదును . నన్ను మాత్ర మెవడును ఎఱుఁగడు . |
అ. ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వన్ద్వమోహేన భారత| సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప ! || 7-27 అ. యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్| తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః|| 7-28 | తేటగీతి. సర్వభూతమ్ములకుఁ బూర్వసంచితమగు మూఢ భావమ్ము పుష్కలంబుగఁ జనించి , ద్వేష రాగమ్ము లందుద్భవించు ద్వంద్వ ములకు , మోహితులై పుట్టుకలు ధరింత్రు. ౨౪ | శత్రువులను తపింపజేయు ఓ అర్జునా ! సమస్త ప్రాణులును పుట్టుకతోడనే రాగద్వేషజనితమగు సుఖదుఃఖాది ద్వంద్వరూపమైన వ్యామోహము వలన మిక్కిలి అజ్ఞానమును బొందుచున్నవి .పుణ్యకార్యతత్పరులగు ఏజనులయొక్క పాపము నశించిపోయినదో , అట్టివారు ( సుఖదుఃఖాది ) ద్వంద్వరూపమగు అజ్ఞానమునుండి విడువబడినవారై దృఢవ్రతులై నన్ను సేవించుచున్నారు . |
అ. జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతన్తి యే| తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మ చాఖిలమ్|| 7-29 | కందము. పుట్టుకఁ జావుల నెఱుఁగని గుట్టుఁ దెలిసికొన్న వాఁడు కోవిదుఁడై , నా జట్టున మెలగి సదా జగ జెట్టి యగుచు సర్వకర్మ సిద్ధి నెఱుంగున్. ౨౫ | ఎవరు వార్ధక్యమును , మరణమును ( సంసారదుఃఖమును ) పోగొట్టుకొనుట కొఱకు నన్నాశ్రయించి ప్రయత్నము చేయుచున్నారో , వారు సమస్త ప్రత్యగాత్మ స్వరూపమున్ను , సకల కర్మమున్ను ఆ బ్రహ్మమే యని తెలిసికొందురు . |
అ. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః| ప్రయాణకాలేऽపి చ మాం తే విదుర్యుక్తచేతసః|| 7-30 | తేటగీతి. సాధి భూతాధి నాథుని , సాధియజ్ఞ యుతునిగా నన్ను దెలిసిన యతఁడె పార్థ ! మరణ కాలమ్మునం గూడ మఱువ కుండ , న న్నెఱుంగుచు ధ్యానించు చున్నవాఁడు. ౨౬ | అదిభూత , అధిదైవ , అధియజ్ఞములతో గూడియున్న నన్నెవరు తెలిసికొందురో వారు దేహవియోగకాలమందును ( దైవమందు ) నిలుకడ గల మనస్సుగలవారై ( మనోనిగ్రహముగలవారై ) నన్నెఱుఁగగలరు . |
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోऽధ్యాయః|| 7 || | ఓం తత్ సత్ ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి చే అనువదింపబడిన శ్రీ గీతామృత తరంగిణియందు శ్రీ జ్ఞాన విజ్ఞాన యోగమను సప్తమ తరంగము సంపూర్ణం. శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. | ఓమ్ ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు , యోగశాస్త్రమును , శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు విజ్ఞానయోగమను ఏడవ అధ్యాయము సంపూర్ణం. ఓమ్ తత్ సత్. |
Subscribe to:
Posts (Atom)